నిజామాబాద్‌లో సీడబ్ల్యూసీ గోదాంలు ఫుల్.. లారీ డ్రైవర్ల ఆందోళన

దిశ, నిజామాబాద్: గోదాంలు ఖాళీ లేవని చెబుతూ శెనగలను కిందికి దించడం లేని ఆరోపిస్తూ లారీ డ్రైవర్లు ఆందోళనకు దిగిన సంఘటన శుక్రవారం మధ్యాహ్నం నిజామాబాద్ నగర శివారులో సారాంగపూర్‌లో చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లాలో రైతుల నుంచి శనగలను కొనుగోలు చేశారు. వాటిని సెంట్రల్ వేర్ హౌస్(సీడబ్ల్యూసీ)ల్లో నిల్వ చేసేందుకు లారీల్లో తరలించారు. సారంగాపూర్ సీడబ్ల్యూసీలో 10 గోదాంలు ఉన్నాయి. వాటి సామర్థ్యం 41 వేల టన్నులు మాత్రమే. ఇప్పటికే అక్కడ 42వేల మెట్రిక్ టన్నుల సరుకుల […]

Update: 2020-04-17 05:17 GMT

దిశ, నిజామాబాద్: గోదాంలు ఖాళీ లేవని చెబుతూ శెనగలను కిందికి దించడం లేని ఆరోపిస్తూ లారీ డ్రైవర్లు ఆందోళనకు దిగిన సంఘటన శుక్రవారం మధ్యాహ్నం నిజామాబాద్ నగర శివారులో సారాంగపూర్‌లో చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లాలో రైతుల నుంచి శనగలను కొనుగోలు చేశారు. వాటిని సెంట్రల్ వేర్ హౌస్(సీడబ్ల్యూసీ)ల్లో నిల్వ చేసేందుకు లారీల్లో తరలించారు. సారంగాపూర్ సీడబ్ల్యూసీలో 10 గోదాంలు ఉన్నాయి. వాటి సామర్థ్యం 41 వేల టన్నులు మాత్రమే. ఇప్పటికే అక్కడ 42వేల మెట్రిక్ టన్నుల సరుకుల నిల్వ ఉంది. కొత్తగా లారీల్లో తీసుకువచ్చిన సరుకులను హమాలీలు లేరనే కారణంతో సిబ్బంది కిందికి దించలేదు. దీంతో లారీ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. దీంతో నిజామాబాద్- బోధన్ రహదారిపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు డ్రైవర్లతో మాట్లాడి ఆందోళనను విరమింపజేశారు. ఈ విషయంపై గోదాం మేనేజర్ శంకర్ మాట్లాడుతూ తమ వద్ద నిల్వ సామర్థ్యం లేదని, సరుకులను దించి ఎక్కడ పెట్టాలని ప్రశ్నించారు. కొత్తగా తీసుకువచ్చిన శెనగలకు కామారెడ్డి జిల్లాలో అలాట్‌మెంట్ చేసినా తిరుగు ఛార్జీలు ఎవరు ఇస్తారని లారీ డ్రైవర్లు ఆందోళనకు దిగారని తెలిపారు.

Tags : carona, lockdown, lorry drivers, arguments eith cwc goudown, officers

Tags:    

Similar News