తిరుమల అంజనాద్రే.. హనుమంతుడి జన్మస్థలం…!

దిశ, వెబ్ డెస్క్ : హనుమంతుడి జన్మస్థలంపై టీటీడీ అధికారిక ప్రకటన చేసింది. తిరుమలలోని అంజనాద్రిపైన ఉన్న జాపాలి తీర్థమే హనుమంతుడి జన్మస్థలమని వెల్లడించింది. దీనికి సంబంధించిన ఆధారాలను జాతీయ సంస్కృత వర్సిటీ విసి ఆచార్య మురళీధరశర్మ ప్రకటించారు. అంజనాదేవి ఆకాశగంగ తీర్థంలో 12 ఏళ్ల పాటు తపస్సు చేయగా వాయుదేవుడు ప్రత్యక్షమై ఇచ్చిన ఫలాన్ని ఆమె తిన్నదని, ఆకాశగంగా సమీపంలోనే హనుమంతుడి జన్మస్థలమని తెలిపారు. పౌరాణిక, వాజ్మయ, శాసన, చారిత్రక ఆధారాల ద్వారా హనుమంతుడి జన్మస్థలాన్ని […]

Update: 2021-04-21 00:59 GMT

దిశ, వెబ్ డెస్క్ : హనుమంతుడి జన్మస్థలంపై టీటీడీ అధికారిక ప్రకటన చేసింది. తిరుమలలోని అంజనాద్రిపైన ఉన్న జాపాలి తీర్థమే హనుమంతుడి జన్మస్థలమని వెల్లడించింది. దీనికి సంబంధించిన ఆధారాలను జాతీయ సంస్కృత వర్సిటీ విసి ఆచార్య మురళీధరశర్మ ప్రకటించారు. అంజనాదేవి ఆకాశగంగ తీర్థంలో 12 ఏళ్ల పాటు తపస్సు చేయగా వాయుదేవుడు ప్రత్యక్షమై ఇచ్చిన ఫలాన్ని ఆమె తిన్నదని, ఆకాశగంగా సమీపంలోనే హనుమంతుడి జన్మస్థలమని తెలిపారు. పౌరాణిక, వాజ్మయ, శాసన, చారిత్రక ఆధారాల ద్వారా హనుమంతుడి జన్మస్థలాన్ని నిర్ధారించమని వారు పేర్కొన్నారు.

Tags:    

Similar News