ట్విట్టర్‌లో లోకేశ్.. ఏమన్నాడంటే ?
దిశ, ఏపీ బ్యూరో: వైఎస్సార్సీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు అనర్హత పిటిషన్ నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఎంపీలంతా ప్రత్యేక విమానంలో డిల్లీ బయల్దేరి వెళ్లిన సంగతి తెలిసిందే. సాయంత్రం మూడు గంటలకు ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో సమావేశం కానున్నారు. దీనిపై టీడీపీ నేత నారా లోకేశ్ ట్విట్టర్ మాధ్యమంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ… ‘కేంద్రానికి మొదటి లేఖగా సెర్బియా పోలీసులు చేతిలో చిక్కుకున్న సహ నిందితుడిని […]
దిశ, ఏపీ బ్యూరో: వైఎస్సార్సీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు అనర్హత పిటిషన్ నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఎంపీలంతా ప్రత్యేక విమానంలో డిల్లీ బయల్దేరి వెళ్లిన సంగతి తెలిసిందే. సాయంత్రం మూడు గంటలకు ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో సమావేశం కానున్నారు. దీనిపై టీడీపీ నేత నారా లోకేశ్ ట్విట్టర్ మాధ్యమంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ… ‘కేంద్రానికి మొదటి లేఖగా సెర్బియా పోలీసులు చేతిలో చిక్కుకున్న సహ నిందితుడిని విడిపించమని ఉత్తరం రాశారు. ఇప్పుడేమో, మీ పార్టీ సమస్య కోసం స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని ఢిల్లీ వెళ్తున్నారు’ అని విమర్శించారు. ‘ఏ రోజు అయినా, కేంద్రం నుంచి రాబట్టే నిధులు కోసం కానీ, ప్రత్యేక హోదా కోసం కానీ, పోలవరం కోసం కానీ ఇలా స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని వెళ్లారా ? మీ పంచాయితీల కోసం ప్రజాధనం వృథా చెయ్యడం ఏంటీ జగన్ గారు?’ అని ప్రశ్నించారు. వారు విమానంలో ఢిల్లీకి వెళ్తోన్న ఫొటోలను ఆయన పోస్ట్ చేశారు.
కేంద్రానికి మొదటి లేఖగా, సెర్బియా పోలీసులు చేతిలో చిక్కుకున్న సహా నిందితుడిని విడిపించమని ఉత్తరం రాసారు. ఇప్పుడేమో, మీ పార్టీ సమస్య కోసం స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని ఢిల్లీ వెళ్తున్నారు. (1/2) pic.twitter.com/iVOgDpMOa7
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) July 3, 2020