రమ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన లోకేశ్
దిశ, ఏపీ బ్యూరో: గుంటూరులో బీటెక్ విద్యార్థిని నల్లపు రమ్య కుటుంబ సభ్యులను నారా లోకేశ్ పరామర్శించారు. సోమవారం వారి ఇంటికి వెళ్లి రమ్య మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. తన కుమార్తెను ఇంత దారుణంగా హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించేలా చూడాలని నారా లోకేశ్‌ను బాధిత కుటుంబ సభ్యులు కోరారు. నిందితుడు ఎవరో తమ కుటుంబానికి తెలియదని కుటుంబ సభ్యులు వివరించారు. తన కుమార్తెలా మరో ఆడపిల్లకు జరగకుండా చర్యలు తీసుకోవాలని […]
దిశ, ఏపీ బ్యూరో: గుంటూరులో బీటెక్ విద్యార్థిని నల్లపు రమ్య కుటుంబ సభ్యులను నారా లోకేశ్ పరామర్శించారు. సోమవారం వారి ఇంటికి వెళ్లి రమ్య మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. తన కుమార్తెను ఇంత దారుణంగా హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించేలా చూడాలని నారా లోకేశ్‌ను బాధిత కుటుంబ సభ్యులు కోరారు. నిందితుడు ఎవరో తమ కుటుంబానికి తెలియదని కుటుంబ సభ్యులు వివరించారు. తన కుమార్తెలా మరో ఆడపిల్లకు జరగకుండా చర్యలు తీసుకోవాలని లోకేశ్‌కు విజ్ఞప్తి చేశారు. తన తల్లిదండ్రులను ఎంతోబాగా చూసుకోవాలని రమ్య నిరంతరం పరితపించేదని కుటుంబ సభ్యులు విలపించారు.
నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని..ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని లోకేశ్ తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇకపోతే లోకేశ్ వస్తున్నారన్న సమాచారంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో ముఖ్యమంత్రి జగన్, పోలీసులకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు నినాదాలు చేశాయి. అనంతరం పలువరు టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.