ఈ వారం రోజులు ఇవే అందుబాటులో ఉంటాయి

ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 31 వరకు లాక్‌డౌన్ అమలులో ఉండనుంది. ఎంత పకడ్బందీ చర్యలు చేపట్టినప్పటికీ ప్రజలు యధేశ్చగా రోడ్లపై కనిపిస్తున్నారు. అయితే వారికి అవసరమైన షాపులు మాత్రం అందుబాటులో లేవు. దీంతో సరదాగా కూరగాయల మార్కెట్లు, షాపుల వెంట తిరుగుతూ కరోనా వ్యాప్తికి సహకరిస్తున్నారు. ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన సందర్భంగా వారికి అందుబాటులో ఉండే సరకులు, సౌకర్యాలు ఏంటంటే.. 1) ఆహార పదార్థాలు, నిత్యావసర సరకులు, పాలు, పండ్లు, కూరగాయలు, చేపల రవాణా 2) శీతల […]

Update: 2020-03-23 05:38 GMT

ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 31 వరకు లాక్‌డౌన్ అమలులో ఉండనుంది. ఎంత పకడ్బందీ చర్యలు చేపట్టినప్పటికీ ప్రజలు యధేశ్చగా రోడ్లపై కనిపిస్తున్నారు. అయితే వారికి అవసరమైన షాపులు మాత్రం అందుబాటులో లేవు. దీంతో సరదాగా కూరగాయల మార్కెట్లు, షాపుల వెంట తిరుగుతూ కరోనా వ్యాప్తికి సహకరిస్తున్నారు.

ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన సందర్భంగా వారికి అందుబాటులో ఉండే సరకులు, సౌకర్యాలు ఏంటంటే..
1) ఆహార పదార్థాలు, నిత్యావసర సరకులు, పాలు, పండ్లు, కూరగాయలు, చేపల రవాణా
2) శీతల గిడ్డంగులు, ఆస్పత్రులు, మెడికల్ షాపులు, కళ్లజోళ్ల దుకాణాలు
3) ఔషధ తయారీ వాటి రవాణా కార్యాలయాలు
4) నిత్యావసర తయారీ యూనిట్లు, వాటి సరఫరా
5) కరోనా నియంత్రణ కార్యాకలాపాల్లో పాల్గొనే ప్రైవేట్ సంస్థలు
6) పెట్రోల్ పంపులు, ఎల్పీజీ గ్యాస్, ఆయిల్ ఏజెన్సీలు, వాటి రవాణా
టెలికం, ఇంటర్నెట్ సేవలు
7) పోలీసు, వైద్య, ఆరోగ్యం, పట్టణ, స్థానిక సంస్థలు..
8) అగ్నిమాపక సిబ్బంది, విద్యుత్, తాగునీరు, పురపాలక సేవలు..
9) బ్యాంకులు, ఏటీఎంలు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్‌ మీడియా
10) ఆహారం, ఔషధాలు, వైద్య పరికరాలను ఈ కామర్స్‌ సైట్ ద్వారా పొందే అవకాశం అందుబాటులో ఉండనున్నాయి. ఇతర ప్రజా ప్రయోజన సౌకర్యాలేవైనా ఉంటే.. వాటి మినహాయింపు కోసం కలెక్టర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Tags: lockdown, services, utensials, ap, public services

Tags:    

Similar News