ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు..
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కట్టడి కోసం ఏపీ ప్రభుత్వం కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. అయితే మొదట విధించిన కర్ఫ్యూ ఈనెల 10వ తేదీన ముగుస్తుండటంతో ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. కర్ఫ్యూను ఈనెల 20వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే ఇదే సమయంలో కొన్ని సడలింపులను ప్రకటించింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూను సడలించినట్టు తాజా ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. […]
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కట్టడి కోసం ఏపీ ప్రభుత్వం కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. అయితే మొదట విధించిన కర్ఫ్యూ ఈనెల 10వ తేదీన ముగుస్తుండటంతో ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. కర్ఫ్యూను ఈనెల 20వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే ఇదే సమయంలో కొన్ని సడలింపులను ప్రకటించింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూను సడలించినట్టు తాజా ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే పనిచేయనున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం వరకు కర్ఫ్యూ యథాతథంగా కొనసాగనుంది.