లాక్‌డౌన్ ఉల్లం‘ఘనులు’

దిశ, నిజామాబాద్: నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్-19) మహమ్మారి కట్టడికిగాను విధించిన లాక్‌డౌన్ సమయంలో ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నిత్యావసర సరుకులు, కూరగాయలు అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కొన్ని చోట్ల పలువురు వీధుల్లోకి సోషల్ డిస్టెన్స్ (సామాజిక దూరం) పాటించడం లేదు. లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కొవిడ్-19 రెడ్ జోన్‌లో ఉండగా, కామారెడ్డి జిల్లా అరెంజ్ జోన్‌లో ఉంది. నిజామాబాద్ జిల్లాలో 20 కంటైన్‌మెంట్ […]

Update: 2020-04-18 04:55 GMT

దిశ, నిజామాబాద్: నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్-19) మహమ్మారి కట్టడికిగాను విధించిన లాక్‌డౌన్ సమయంలో ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నిత్యావసర సరుకులు, కూరగాయలు అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కొన్ని చోట్ల పలువురు వీధుల్లోకి సోషల్ డిస్టెన్స్ (సామాజిక దూరం) పాటించడం లేదు. లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తున్నారు.

నిజామాబాద్ జిల్లా కొవిడ్-19 రెడ్ జోన్‌లో ఉండగా, కామారెడ్డి జిల్లా అరెంజ్ జోన్‌లో ఉంది. నిజామాబాద్ జిల్లాలో 20 కంటైన్‌మెంట్ క్లస్టర్‌లు ఉండగా కామారెడ్డి జిల్లాలో 3 కంటైన్‌మెంట్ క్లస్టర్‌లు ఉన్నాయి. ఈ జోన్‌లలో రాకపోకలపై నిషేధం అమల్లో ఉన్నది. అయా ప్రాంతాలకు నిత్యావసరాలను అధికార

యంత్రాంగం మొబైల్ వాహనాల ద్వారా చేరవేస్తోంది. ప్రజలకు వైద్య సేవలకు టెలి మెడిసిన్ విధానం అమలవుతోంది. తెలంగాణలో రెడ్ జోన్‌లో ఉన్న జిల్లాలో రాజధాని తర్వాత ఎక్కువ కేసులు ఉన్నది ఇందూరు జిల్లాలోనే. ఇక్కడ కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 58, కామారెడ్డి జిల్లాలో 11 కేసులు. మొత్తం 69 కేసులు ఉన్నాయి. అందులో యాక్టివ్ కేసులు 50 కాగా 19 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. జిల్లాలో ఇంకా కొన్ని కొవిడ్ శాంపిళ్ల రిజల్టు రావాల్సి ఉంది.

కరోనా విస్తరణ ఎక్కువగా ఉన్న జిల్లాల్లో తెలంగాణలో ఇందూరు జిల్లా రెండో స్థానంలో ఉంది. ఈ విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్‌గా తీసుకుని కట్టడికి ప్రణాళికలు రూపొందించాయి. కేంద్రం ఈ నెల 20 నుంచి ప్రకటించిన సడలింపులు ఏవీ నిజామాబాద్ జిల్లాకు వర్తించవు. పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ఈ నెల ఆఖరు వరకు కొనసాగుతుంది. పోలీసు, వైద్య, ఆరోగ్య, మున్సిపల్, రెవెన్యూ శాఖలు అమలుకు అహర్నిశలు కృషి చేస్తుంటే కొన్ని చోట్ల ఉల్లంఘనలు అవుతున్నాయి.

రెండు అంతర్రాష్ట్ర సరిహద్దుల మూసివేత

ఉమ్మడి జిల్లాలో ఉన్న రెండు అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసేశారు. అత్యవసరమైన, నిత్యావసర వస్తువుల మినహా ప్రజల రాకపోకలను నిషేధించారు. పలు ఆంక్షలు అమలు చేస్తున్నారు. అయినా కొందరు లాక్‌డౌన్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో 26 రోజుల్లో పోలీసులు సీజ్ చేసిన వాహనాల సంఖ్య 3,500 వరకు చేరింది. లాక్‌డౌన్ ఉల్లంఘన కేసులు 75 వరకు నమోదు అయ్యాయి. కామారెడ్డి జిల్లాలో 4,789 వాహనాలను సీజ్ చేయగా, లాక్ డౌన్ ఉల్లంఘన కేసులు 50 వరకు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.

లాక్‌డౌన్ వల్ల నష్టపోయిన కార్మికులు, నిరుపేదలను ఆదుకునేందుకు పలువురు చేసే సేవా కార్యక్రమాల్లో సోషల్ డిస్టెన్స్ పాటించడం లేదు. ఇప్పటికే అధికార యంత్రాంగం నిరాశ్రయులకు, ఇతర రాష్ట్రాల వారికి, దూరపు ప్రయాణాలను చేస్తున్నవారికి ఆశ్రయంతో పాటు భోజన సదుపయాలను కల్పిస్తోందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దాతలు నేరుగా నిరాశ్రయులు, నిరుపేదలకు అందించే నిత్యావసరాలు, సామగ్రి పోలీసు శాఖ లేదా అధికారులకు అందిస్తే వారికి చేరవేస్తారని అంటున్నారు. పోలీసు శాఖకు సమాచారమిస్తే తగిన బందోబస్తు ఏర్పాటు చేసి సహకరిస్తారని చెబుతున్నారు. ఇష్టారీతిన కార్యక్రమాలు చేస్తే కేసుల్లో చిక్కుకుంటారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రజలను ఆదుకునేందుకు బ్యాంకుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేసిన డబ్బులు తీసుకునేందుకు ప్రజలు గుంపులు, గుంపులుగా బ్యాంకుల వద్ద గుమిగూడుతున్నారు. అయితే, అక్కడ ప్రజలు స్వీయ నియంత్రణ పాటించేలా అవగాహన కల్పించాలని లేదంటే బ్యాంకుల కాడ కరోనా ముప్పు పొంచి ఉంటుందని పలువురు చెబుతున్నారు.

Tags: Lockdown, violation, red zone, covid 19, coronavirus, indore

Tags:    

Similar News