కీలక నిర్ణయం తీసుకున్న యూపీ సర్కార్

దిశ, వెబ్ డెస్క్: ఉత్తర ప్రదేశ్ లో రోజురోజుకు కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మూడురోజులపాటు లాక్ డౌన్ విధిస్తూ ప్రకటించింది. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి 13వ తేదీ ఉదయం 5 గంట వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు పేర్కొంది. అయితే.. ఈ లాక్ డౌన్ నుంచి అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చారు. అదేవిధంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులన్నింటినీ […]

Update: 2020-07-10 02:42 GMT

దిశ, వెబ్ డెస్క్: ఉత్తర ప్రదేశ్ లో రోజురోజుకు కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మూడురోజులపాటు లాక్ డౌన్ విధిస్తూ ప్రకటించింది. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి 13వ తేదీ ఉదయం 5 గంట వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు పేర్కొంది. అయితే.. ఈ లాక్ డౌన్ నుంచి అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చారు. అదేవిధంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులన్నింటినీ మూసివేయాలని ఆదేశించింది. అదేవిధంగా విమానసర్వీసులు, రైళ్లు మాత్రం యాధావిథిగా కొనసాగించాలని పేర్కొన్నది. ఉత్తరప్రదేశ్ లో ఇప్పటిదాకా 30 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.

Tags:    

Similar News