స్థానిక సంస్థల ఎన్నికపై సుప్రీం, హైకోర్టుల్లో పిటిషన్లు..!

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు అంటూ ప్రత్యేక అధికారాలు వినియోగిస్తూ ఎన్నికల సంఘం చేసిన ప్రకటనను నిరసిస్తూ పిటిషన్ దాఖలు చేసినట్టు తెలిపింది. దీనిపై స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్ లలిత్‌ ఈ పిటిషన్‌ను రేపటి రెగ్యులర్‌ లిస్టులో ఉంచాలని ఆదేశించారు. […]

Update: 2020-03-16 02:48 GMT

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు అంటూ ప్రత్యేక అధికారాలు వినియోగిస్తూ ఎన్నికల సంఘం చేసిన ప్రకటనను నిరసిస్తూ పిటిషన్ దాఖలు చేసినట్టు తెలిపింది. దీనిపై స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్ లలిత్‌ ఈ పిటిషన్‌ను రేపటి రెగ్యులర్‌ లిస్టులో ఉంచాలని ఆదేశించారు. మరోవైపు ఏపీ ఎలక్షన్ కమిషన్ నిర్ణయంపై హైకోర్టులో తాండవ యోగేష్‌, జనార్దన్‌ అనే ఇద్దరు వ్యక్తులు లంచ్‌మోషన్‌లో ప్రైవేటు పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను ధర్మాసనం అనుమతించడంతో నేటి మధ్యాహ్నం విచారణకు రానుంది.

Tags:    

Similar News