ప్రశాంతంగా కొనసాగుతోన్న బద్వేలు పోలింగ్..

దిశ, ఏపీ బ్యూరో: బద్వేలులో ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతోందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కే విజయానంద్ అన్నారు. బద్వేలు ఉప ఎన్నికను వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం నుంచి పర్యవేక్షిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే 24 మంది ఉన్నతాధికారులు పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. దొంగ ఓటర్లను తరలిస్తున్నారంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. ఈ అంశంపై తమకు ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. ఎక్కడా […]

Update: 2021-10-30 03:15 GMT

దిశ, ఏపీ బ్యూరో: బద్వేలులో ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతోందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కే విజయానంద్ అన్నారు. బద్వేలు ఉప ఎన్నికను వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం నుంచి పర్యవేక్షిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే 24 మంది ఉన్నతాధికారులు పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. దొంగ ఓటర్లను తరలిస్తున్నారంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదన్నారు.

ఈ అంశంపై తమకు ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. ఎక్కడా కూడా పోలింగ్‌ ఆగలేదని విజయానంద్‌ స్పష్టం చేశారు. ఓటర్లంతా రాత్రి 7 గంటల వరకు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా పోలింగ్ శాతం వివరాలను తెలియజేశారు. ఉదయం 11 గంటల వరకు 20.89శాతం.. ఉదయం 9 గంటల వరకు 10.49 శాతం నమోదైనట్లు విజయానంద్ పేర్కొన్నారు.

Tags:    

Similar News