అతిపెద్ద డైనోసర్ శిలాజం కనుగొన్న చిన్నారి
దిశ, ఫీచర్స్: మానవ ఆవిర్భవానికి ముందు భూమిపై రాక్షసబల్లులు జీవించాయని చరిత్ర చెబుతోంది. కాలక్రమేణా అవి పూర్తిగా అంతరించిపోవడంతో భూమిపై మనిషి ఆధిపత్యం మొదలైంది. 233-243 మిలియన్ ఏళ్ల క్రితం ట్రయాసిక్ కాలంలో ఇవి మొదట జీవించినట్లు తెలుస్తోంది. కానీ, వాటి మనుగడ ఎప్పుడు అంతమైదో ఇప్పటికీ కచ్చితంగా తెలియదు. పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇటీవల దాదాపు 9.8 కోట్ల ఏళ్ల వయసున్న అతిపెద్ద డైనోసర్ శిలాజం అర్జెంటీనాలో లభించగా, దాని ఎముకలు ఒక్కోటి […]
దిశ, ఫీచర్స్: మానవ ఆవిర్భవానికి ముందు భూమిపై రాక్షసబల్లులు జీవించాయని చరిత్ర చెబుతోంది. కాలక్రమేణా అవి పూర్తిగా అంతరించిపోవడంతో భూమిపై మనిషి ఆధిపత్యం మొదలైంది. 233-243 మిలియన్ ఏళ్ల క్రితం ట్రయాసిక్ కాలంలో ఇవి మొదట జీవించినట్లు తెలుస్తోంది. కానీ, వాటి మనుగడ ఎప్పుడు అంతమైదో ఇప్పటికీ కచ్చితంగా తెలియదు. పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇటీవల దాదాపు 9.8 కోట్ల ఏళ్ల వయసున్న అతిపెద్ద డైనోసర్ శిలాజం అర్జెంటీనాలో లభించగా, దాని ఎముకలు ఒక్కోటి మనిషి సైజులో ఉన్నాయి. ఇప్పటివరకు పటగొటియన్ మయోరమ్ అనే డైనోసర్‌నే అతిపెద్ద డైనోసార్‌గా భావించగా, కానీ తాజా శిలాజం ఎముకలు ఈ పటగొటియన్ కన్నా 10–20 శాతం పెద్దవిగా ఉన్నాయని సీటీవైఎస్ సైంటిఫిక్ ఏజెన్సీ తెలిపింది. ఇక సౌత్ వేల్స్‌లోని ఒక బీచ్‌లో 220 ఏళ్ల నాటి డైనోసర్ పాదముద్రను నాలుగేళ్ల బాలిక తాజాగా కనుగొంది.
బ్రిటన్ సౌత్ వేల్స్‌కు చెందిన నాలుగేళ్ల లిలీ విల్డర్, తన తండ్రి, తన పెట్ డాగ్‌తో కలిసి స్థానిక బెన్డ్రిక్స్ బీచ్బేలో నడుచుకుంటూ వెళుతుండగా, రాయి పైనున్న కాలిముద్ర చూసి, నాన్నకు చెప్పింది. ‘ఆ పాదముద్రలను ఫొటోలు తీసిన లిల్లీ ఫాదర్ రిచర్డ్ కుటుంబ సభ్యులతో పాటు స్థానికులతో వాటిని పంచుకున్నాడు. లిల్లీ గ్రాండ్ మదర్ ఆ ఫోటోలను చూసి ఎంతో అద్భుతంగా ఉన్నాయని, లోకల్ ఎక్స్‌పర్ట్స్, ఫాసిల్ ఎంతూసియాసిస్ట్‌లను కలవాలని సలహా ఇచ్చింది. నిపుణులు దాన్ని పరిశీలించారు. పాదముద్రను చట్టబద్ధంగా తొలగించడానికి నేచురల్ రిసోర్స్ నుంచి ప్రత్యేక అనుమతి లభించింది’ అని లిల్లీ మదర్ సాలీ తెలిపింది. ఈ వారంలో అధికారులు ఆ శిలాజాన్ని వెలికితీసి నేషనల్ మ్యూజియం కార్డిఫ్‌లో భద్రపరచనున్నారు. ఈ పురాతన ఫుట్ ప్రింట్ ఆధారంగా ఇది గ్రాలేటర్ అని పిలిచే డైనోసర్‌గా శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని ద్వారా డైనోసర్లు ఎలా నడిచాయో తెలుసుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. శిలాజ కాలి ముద్ర 10 సెంటీమీటర్లకు పైగానే ఉంది. దీన్నిబట్టి ఆ డైనోసర్ 75 సెంటీమీటర్ల ఎత్తు, 8 అడుగుల వెడల్పు ఉండేదని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.