ఉద్యమకారుడా... తెలంగాణ వీరుడా...!
పాలమూరు మట్టిలోన మొలకెత్తిన బాలుడా..!
పల్లె పల్లె పోరు లోన దరువేసిన ధీరుడా..!
వేద సాయిచంద్ అందుకో వందనాలు..
తెలంగాణ సాధనలో పాటవై సాగినావు
అమరుల గొంతుకై ఎలుగెత్తి పాడినావు
'శివుడినే' నిలదీసి సిపాయిగా నిల్చినావు
వాగ్గేయకారుడా సాయి చంద్ జోహార్లు
పాటనే ప్రాణంగా ప్రేమించిన బతికినావు...
తెలంగాణ నేల మీద సంతకమై నిల్చినావు
అమరచింత పుత్రుడా ! అమరుడా మా సాయిచంద్
అందుకో అభిమానుల కన్నీటి వందనాలు
పూరి గుడిసెల పుట్టినీవు పోరుజెండా ఎత్తినావు
పాటల వృక్షమై రాష్ట్రమంతా పాకినావు
తెలంగాణ పోరు ధూమ్ ధూమ్ లోన....
ప్రగతి పథంలోన సాగింది నీ గొంతు....
ప్రజల గుండెల్లో పాటై మురిసినావు
మైక్ చేతవట్టికొని పాటలే పాడుతుంటే...
కిందున్న జనమంతా ఆటలే ఆడుతుంటే
సప్పట్లు, కేరింతలు ప్రతి గొంతు ప్రతిధ్వనై
మారుమోగిందా ప్రదేశమంతా
పాటల వాగై సెలయేరులా పారినావు
తెలంగాణ శిఖరాన కిరీటమై వెలిగినావు
తెలంగాణ సమాజం నిన్ను మరువకుంటది
కవులు కళాకారులంతా నీ యాదిలో ఉంటరు
నీ యాదిలో ఉంటరు నిన్ను దలుసుకుంటరు
జి. చంద్రమోహన్ గౌడ్
98665 10399