గల గల గోదారి
బిర బిర కృష్ణమ్మ
ప్రవహిస్తున్నట్లు మా
పాలమూరు పరుగులు తీస్తుంది!
సెలిమెల నీళ్ళు తోడిపోసినట్లు
కృష్ణవేణి కొంగున ఎత్తిపోతలై పారుతుంది..
కొత్త ఇంట్లో పాలు పొంగినట్టు..
పాలమూరు-రంగారెడ్డి పంటపొలాల్లో పొంగి పొర్లుతుంది
నా తెలంగాణ కోటి రత్నాల వీణ వలే
నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణి అన్నట్లే
నా తెలంగాణ కోట్లాది కోట్ల పుట్లు పండే వరి పైరు
బీడుబారి నెర్రెలిచ్చిన భూములన్ని
గుట గుట నీళ్ళు తాగుతున్నాయి
నాలుక ఎండిన గొంతులై దూప తీర్చుకుంటున్నాయి
ఆకలైన శరీరాలై కడుపు నిండా బువ్వ తింటున్నట్లున్నవి
పారం కంప పల్లెరుకాయలు మొలిచిన తనువులు
పాలమూరు - రంగారెడ్డి రాకతో పొద్దుతిరుగుడు పూలైనవి
వేరుశనగ పత్తి పంటలై పచ్చగా మొలకెత్తుతున్నాయి
సముద్రం పిల్ల కాలువల వైపు ప్రయాణిస్తుంది
తెలంగాణ పొలాల్లో పంటల వైపు పరుగెడుతుంది
ఇదీ నిజమే మా పల్లెలో చెరువులన్నీ సముద్రాలైనవి
వ్యవసాయ రంగంలో మా భూములన్ని బిజీ అయినవి
వాణిజ్య పంటలతో తెలంగాణ భూములన్నీ ఖరీదైనవి.
ఎజ్జు మల్లయ్య
తెలుగు లెక్చరర్
96528 71915