కాళన్న.....
నా తెలంగాణ కాదిప్పుడు
కోటి రతనాల వీణ
అదిప్పుడు !
తీగలు తెగి గుండెలు
రగులుతున్న మౌనగ్ని వీణ
వేల తల్లుల కన్నీటిధారల
శోకగీతం !
బిడ్డలను పోగొట్టుకున్న తల్లులు
నీ జాడలను వెతుకుతున్నారు
కాళన్న నీ ధైర్యం కోసం
ఎదురుచూస్తున్నారు !
దగాపడ్డ దళితులారా
దగాకోరులపై దండోరా మోగిద్దాం !
హక్కులు కోల్పోయిన
అడవి బిడ్డలారా తుడుం
మోగింది విల్లుకాడిలా
ఎక్కుపెట్టండి !
దొరల తెలంగాణలో
ప్రజల ఆకాంక్షలు నెరవేరవు
ప్రజల ఆత్మగౌరవం
నిలబెట్టలేవు!
కష్టాల కొలిమిలో
కాగిపోతున్న కార్మికుడా !
దగాపడ్డ రైతన్న
నిరుద్యోగ యువతా
కదం తొక్కుతూ
కవాతు చేస్తూ !
పోరాటం మంటే
దోచుకునేటోళ్లకు
దోయబడేవాళ్లకుకొట్లాట్లే
కాళన్నా ఆశించిన తెలంగాణ
(ప్రజాకవి కాళోజీ జయంతి )
-బి ప్రవీణ్
81424 60664