జైలు..

poem on Jail

Update: 2023-09-24 18:45 GMT

నిలువెత్తు ద్వారాలు నిటారుగా చూస్తున్నాయి...

లాఠీలకు జడుపు లాంటి సంకెళ్ళ సవ్వడిని నిర్లిప్తంగా !

మార్పు కోసం మనిషిలో పరివర్తన కోసం...

కాల వ్యవధితో కూడుకున్న

నిర్బంధ వసతి గ్రుహంలోకి ప్రవేశం....కానీ!

యెత్తైన జైలు గోడలు మనిషి మేథస్సుని అడ్డుకోగలవా?

కదలికలను నియంత్రించ వచ్చేమో కానీ ...

కోటి రతణాల వీణ లైన జైలు గోడలు చాలదా...

కవులకు అదొక కవిత్వ కర్మాగారం అని ....!

చదువరులకు పట్టాలనందించే విద్యాలయాగారం..

ఉగ్రవాద, భందిపోటులకు అదొక చీకటి బందీఖాన ...

కరుడు గట్టిన కసాయి నేరగాళ్ళకు కఠిన ఖారాగారం!

వి.ఐ.పిలకు మాత్రం విశ్రాంతి శాల ...!

‘రిమాండ్’ ఖైదీలకు అదొక కటకటాల కాలాగారం

అయితే, నిజాన్ని నిరూపించుకోలేక నిందించబడి..

నిర్భందించబడిన నిజమైన నిరపరాదులకు మాత్రం

అదొక నిప్పుల నిర్బంధ చెరసాల!

సమాజంలో భాగమే అయినా శ్రేయస్సు కోసం

విధిగా నిర్బంధంలోకి తోసివేయబడ్డ

ప్రత్యేక సమూహం.. అయినా ఒంటరితనం

ఎవరో వొస్తారని ..

ములాఖత్ పిలుపు కోసం ఆరాటం ఆ

నిశ్శబ్ద జీవితం లో పలకరింపుల కోసం

ఎదురు చూపుల్లో ఏదో ఆశ...మరేదో ధీమా..

మార్పుకు నాందిగా !!!

-న్యాలకంటి నారాయణ

95508 33490

Tags:    

Similar News

వెలుగు

పగటి వేషం