నెలవంకను తాకిన భారత ఖ్యాతి

poem on chandrayan-3

Update: 2023-08-27 18:30 GMT

నెలవంకను తాకిన భారత ఖ్యాతి

నెలవంకను తాకిన భారత త్రివర్ణం

జాతి ఖ్యాతికి మరో నిదర్శనం.

భరత ధాత్రిపై వెన్నెల వర్షం కురిసింది.

మరో మహా విజయోత్సవానికి నాంది పలికింది.

అసూయకు మరో అపజయం.

ప్రతిభకు దక్కిన నిండైన విజయం

అణిచేస్తే అగని ప్రతిభ ఎలుగెత్తి చాటి,

మహా ప్రభంజనమై,

నెలవంకపై నాట్యమాడింది.

పతాకంపై చంద్రుడు చిన్నబోయి,

చంద్రుడిపై పతాకం

చిద్విలాసం చేసింది.

ఎగిరెగిరి పడ్డ అహంకారం

ఎగిరిన త్రివర్ణాన్ని చూసి

తలదించుకుంది.

బంగారానికి చెదలు పట్టునా

నిజమైన ప్రతిభను

నిలువరింప సాధ్యమా

 సుంకవల్లి సత్తిరాజు

97049 03463

Tags:    

Similar News

వెలుగు

పగటి వేషం