చంద్రయానం

poem on chandrayan-3

Update: 2023-08-27 18:30 GMT

సీ.

శ్రీహరి కొలువైన శ్రీహరి కోటలో

క్షిపణిని బంపెను క్షితిజమందు

శాస్త్రీయ శోధనల్ సకలంబు శోధింప

శాస్త్రవేత్తలు బంపె చంద్రయాను

ఇండియా ఘనకీర్తి నిలలోన నిల్పగన్

ఇస్రోయె సంధించే నింపుగాను

నేల కక్ష్యను దాటి నెలవంక జేరగన్

నిర్ణీత కక్ష్యలో నింగికెగిసె

నలుబది రోజులు నడయాడి గగనాన

రివ్వుమంటు నెగిరె రేడు జేర

విను వీధిలోవెల్గి విఖ్యాతి నార్జించి

విశ్వ వర్థినై వర్థిల్లె నశ్వరముగ

తే.గీ.

విక్రము ల్యాండరు పయనించె సక్రమముగ

స్వర్ణ రథమోలె వెడలెను చంద్రయాను

చందమామను ముద్దాడె నందితముగ

నిలిచె దక్షిణ ధ్రువమందు నిక్కముగను

జాతి ముద్రను ముద్రించె జాబిలందు

భరత ఖండంబు హర్షించె భవ్యముగను

గంగాపురం శ్రీనివాస్

96763 05949

Tags:    

Similar News

వెలుగు

పగటి వేషం