జాబిలిపై

poem on chandrayan-3

Update: 2023-08-27 18:45 GMT

పదపోదాం చంద్రుని చెంతకు

పోదాంపద పిలుస్తుంది చంద్రకాంత

భేటీలు డ్యూటీలు వుండేవే

క్లబ్బుల్లో బ్యూటీలు

పబ్బుల్లో నాటీలు వుండేవే

రెక్కలుకట్టుక ఎగిరి

భూకక్ష(క్ష్య)లు వీడి

శశినీడన చేరి

పులకరిద్దాం మొలకరిద్దాం

పద పద ప్రయోగాలకు పాటై

ప్రతిష్టాత్మక ప్రమాణాలకు బాటై

పోదాం పోదాం

తారల జలతారులు

సితార్ గీతాల సెలయేరులు

రొటీన్.. చేరుకుందాం తారతీరం

చేసుకుందాం తారోత్సహం

చేరుకుందాం తారద్వీపం

చేసుకుందాం వారోత్సహం

అలరించే ఆకాశవీధిలో

అంతులేని ఆసక్తి

కనిపించే అంతరిక్షంలో

కళాతీతమో అనురక్తి

గ్రహంతరవాసానికి సై

నవగ్రహాసహవాసానికి జై

ఇది ప్రకృతి రూపంలో

మానవ ఆరాధన

ఇది వికృత రాగంలో

మా(నవ)అన్వేషణ

తారాబలం చంద్రబలం

తమబలమనుకునే

బలహీనులు భేష్

రాశిఫలాలను రాసులుపోసే

రాచపండితులు భేష్

క్షణకాల కణజాల శోధనతో

సాధించిన మేధోమథనం భేష్

శాస్త్రీయ హేతువాద

గతితార్కిక సైద్దాంతిక

మేధోకదనం భేష్

వేయిరేకుల లక్షరేఖల

కోటిదారుల విస్తరించిన విశ్వం భేష్

కోటం చంద్రశేఖర్

94920 43348

Tags:    

Similar News

వెలుగు

పగటి వేషం