అందిన చందమామ..!

poem on chandrayan-3

Update: 2023-08-27 18:30 GMT

సుదూర తీరాల్లో వున్న

నిండు జాబిల్లి కోసం

కోట్ల వాలు కన్నులతో

నీలాకాశ మల్లే

నిద్దురమాని ఎదురు చూసింది

యావత్ భారతం ..!

చంద్రయాన్ - 3

శాస్త్రీయ ప్రయోగం చేసి

చందమామ కరమును

మృదువుగా అందుకుంది భారత్ ..!

శతకోటి భారతీయులకు గర్వకారణం..!

శాస్త్రవేత్తల ప్రతిభకు వీరతోరణం...!

చంకనెత్తుకొని చంటోడికి నింగిలో

అమ్మ చూపించిన చందమామ

నేడు గుమ్మంలోకి వచ్చినాడు ..!

జవరాలి వదనంతో

ముదితల దరహాసంతో పోల్చిన

జాబిల్లిని ఎదురుగా చూసి..

అందగత్తెలు మురిసి పోయిరి...!!

చల్లని వెన్నెల కోసం పరితపించే

చకోరపక్షికి ఇక ఆకలిదప్పులుండవు..!

కార్తీక పున్నమి కోసం

వేయి కనులతో ఎదురు చూసే

ప్రకృతి ప్రేమికులకు ఇప్పుడు

వెండి చందమామ కోసం

నిరీక్షించే చింత వుండదు...!!!

జి.సూర్యనారాయణ

62817 25659

Tags:    

Similar News

వెలుగు

పగటి వేషం