“మబ్బుతునక జేబురుమాలు
మాటు చేసుకున్న జాబిల్లీ !
ఏమో బహుశా త్వరలో
నీ ఇంటికి రావొచ్చు మేము
స్వాగతం ఇస్తావు కదూ !
ఆతిధ్యానికర్హులమే మేము !
చంద్ర మండలానికి ప్రయాణం
సాధించరాని స్వప్నం కాదు
గాలికన్నా బరువైన వస్తువుని
నేల మీద పడకుండా నిలబెట్టలేదూ ?
పరమాణువు గర్భంలోని
పరమ రహస్యాలు...
మహాకాశ వాతావరణంలోని
మర్మాలు తెలుసుకున్నాక
సరాసరి నీదగ్గరకే
ఖరారుగా వస్తాంలే
అపుడు మా రాయబారుల్ని
ఆదరిస్తావు కదూ నువ్వు ?''
చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ సందర్భంగా, దాదాపు 60 ఏళ్ల నాడు మహాకవి శ్రీశ్రీ తన 'ఖడ్గ సృష్టి' లోని 'శరచ్చంద్రిక' కవితలో రాసిన కొన్ని కవితా పంక్తులు గుర్తుకొస్తాయి. ఇది శ్రీశ్రీ 1966 లోనే అందించిన “మానవుని ప్రోగ్రెస్ రిపోర్ట్” మరి.
-మహాకవి శ్రీశ్రీ