ఆకాశాన్ని రంగుపొడిలో
భూమిని రంగు ద్రావణంలో ముంచగలవు.
వచ్చీ పోయే ఆలోచనలు మాత్రం
మనసును సహస్ర రంగుల్లో ముంచగలవు.
ఒక్కోసారి కాలం దాడి చేసి గెలిచి జీవితానికి
ఏ ఋతువు లేకుండా చేయగలదు.
ఒంటరి చినుకువి నీవు అని
నీకు తెలిసి వచ్చేసరికి నూకలు చెల్లి
మట్టిలో కలిసి పోతావు.
చీకటికి పుట్టే బాధ వెన్నెలకు పొంగే సంతోషం
నీవి కాదని తెలుసుకొని గాలికి
ఎగురుతున్న చితుకులా బతుకు.
నీదే కాదు అన్ని ప్రాణులూ..
విశ్వాల అవతలి విశ్వం వాటి అధీనంలో
అవి ఎన్నటికీ మనుగడ సాగించలేవు.
అర్థం కానితనాన్ని మీదికి ఎత్తుకొని
మనసు పగిలిన చోటల్లా.. గుచ్చుకున్న
అద్దపు ముక్కల్ని లాగేస్తూ బతికేయ్.
- రాజీ