రండి పిడికిలి బిగించి.‌.

Poem

Update: 2024-10-20 22:30 GMT

వేటగాళ్లు రూటు మార్చారు

చేతికిమట్టంటకుంటనే

చితికి చేరుస్తున్నారు

మొన్న రామనాథం, నారాయణ

నిన్నస్టాన్‌స్వామి,గద్దర్

నేడు సాయిబాబా

రేపు నువ్వో నేనో ....

వాడి పాశవిక దాడికి బలే.

నిలువెత్తు మనిషి చనిపోయాక

జోహర్ జోహార్ల జోరు

సాధిస్తాం ఆశయాలు

పూనకమొచ్చినట్లు నినాదాలహోరు

తెల్లారితే బతుకు తెరువు కోసం ఆరాటం

భారత మాతను అంగడి సరుకు జేసినా

మనకు చలనం లేదు

దేశ సంపదలను కాపాడే

పోరుబిడ్డలు కాల్చివేయబడినా

మనకు సంబంధం లేదు

ఆదివాసుల‌

ఆర్తనాదాలు ఊచకోతలు

మనకు కనబడవు.

మనకు వినిపించవు

కలిసికట్టుగా పోరుజేస్తే

ఆపడం ఎవరితరంకాదు

ఆనాడే ఏకమై ఎదురుతిరిగితే

ఈ సాయిబాబా

అండాసెల్లు పాలవకపోవు

కాల్చివేతలుకూల్చివేతలపై

ఎన్కౌంటర్లు, హత్యలపై

నోరెత్తకుంటే రేపు

నీవోనేనో...హతమవ్వాల్సిందే

ప్రాణాలపై ప్రీతి మనలో

చైతన్యం చంపుతుంది.

రండి ప్రశ్నించుదాం

రండిపోరాడుదాం

ప్రజాస్వామ్యికహక్కులకోసం

జీవించే హక్కు కోసం...

రాజ్యహింసకు వ్యతిరేకంగా

రాజ్యాంగ రక్షణ కోసం...

పిడికిలి బిగించి

రండీ కదలండీ.

తాళ్ళపెల్లి స్వామి

90597 59031

Tags:    

Similar News