తెల్ల కోటు వెనకాల..

Poem

Update: 2024-10-14 00:15 GMT

నిద్రలేని రాత్రులెన్నో

ముగింపు లేని రోజులెన్నో

ప్రతి నిత్యం రోగులను

పరీక్షిస్తూనే ఉంటాం..

మార్గ నిర్దేశం చేస్తాం

కానీ మా జీవితాల గురించి విస్మరిస్తాం..

రోగులకు విశ్రాంతి, ఆరోగ్యమైన ఆహారం

తీసుకోమని చెబుతాం..

కానీ మా అవసరాలు మర్చిపోతాం

మేము ఇతరులకు ఒత్తిడి లేని

జీవితం గడపాలని చెబుతాం..

మా ఒత్తిడిని మాలోనే సమాధి చేస్తాం.

ప్రతి సమస్య మాకో కొత్త సవాలే..

అయినా మా సవాళ్ళను మేము

విచారం లేకుండా

చిరునవ్వుతో ఎదుర్కొంటాము..

జీవితం చిన్నది అని తెలుసు

అయినా రోగుల కోసం ధారపోస్తూనే ఉంటాం..

మీ ఆరోగ్యం కోసం సదా యత్నిస్తాం.

ఇతరుల ఆరోగ్యం కోసం

మేము మా సర్వస్వాన్ని దారపోస్తాం

మా వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెడతాం..

మా సహచరులు మా జీవితం

పై జాలి పడుతున్నా

మేమూ ప్రతినిత్యం రోగులకోసం

పోరాడుతూనే ఉంటాం..

ఈ పోరాటంలో వైద్యులుగా గర్విస్తాం,

సదా వెన్నంటే ఉంటాం.

రోగి చిరు నవ్వును చూసి

మా శ్రమను జయిస్తాం...

ఆంగ్ల మూలం: Dr. N. V. అభిషేక్

స్వేచ్ఛానువాదం: శిరందాస్ శ్రీనివాస్

94416 73339

Tags:    

Similar News