ఆ విద్యాపీఠానికి

Poem

Update: 2024-10-14 00:00 GMT

ఆ విద్యాపీఠానికి నూరేళ్ళు

ఆ విద్యాదేవి ఆలయం వెలగనీ వెయ్యేళ్ళు

నిర్మించిన సంకల్పం గొప్పదై

దర్శించిన వారంతా విద్యా వినయ వివేకులై

చదువిచ్చి ఎగిరెస్తే

గువ్వలమయ్యాం నీలాలనింగిలో

అనుభవమిచ్చి వదిలేస్తే

చేపలమయ్యాం గలగలనదిలో

అతడు కోటంత బలం

ఆమె తోటంత పరిమళం

బాణాలు సంధించడం

కిరణాలు ఎక్కుపెట్టడం అప్పుడే...

మొన్నటి ఘటనలు సంఘటనలు గుర్తొస్తే

నిన్నటి గుర్తులు జ్ఞాపకాలు గుబాళిస్తే

నరనరాల పారుతుంది ఆ స్ఫూర్తి

తరతరాల వెల్గుతుంది ఆ కీర్తి

అందమై, సర్వాంగ సుందరమై

మనసు పులకించే శిల్పకళావైభవమై

నిత్యహోమాలు యజ్ఞయాగాదులతో

తరించిన తపోవనంలా దివ్యక్షేత్రమై

దీర్ఘకాల భవిషత్తు అందించి

ఒడ్డుకు చేర్చే ఓర్పు ప్రసాదించి

మా బతుకులకి ఒక యోగ్యతాపత్రమై

మా అతుకులకి ఒక పురోగమన మంత్రమై

(ఉస్మానియా ఊయలలో)

కోటం చంద్రశేఖర్

94920 43348

Tags:    

Similar News

మంద దీపాలు

నియంత అంతం