అబద్ధం నిజమై మేఘాన్ని తట్టింది
సకాలం కాకున్నా ముందే వర్షించగా
పంట చేల్లు నీళ్ల బరువు మోయలేక
స్వచ్ఛమైన పంట కంటనీరు పెట్టింది.
భూమి మీద ప్లాస్టిక్ వ్యర్తాలు ఎక్కువై
బోరుబావి పాతాళంలో చుక్కనీరు లేక
జాడెక్కడని వెతికినా ఆనవాళ్లు లేక
నిత్యం నేల రోదించినా మారని మనిషి.
మరి గాలి కూడా రేడియేషన్
తక్కువనుకున్నదని నమ్మి,
సిగ్నల్లను సిక్సర్లు కొట్టించారు.
రెండు చరవాణిలు జేబుల్లో
సర్దుకొని దర్జాగా నడుస్తున్నరు.
నిజమే నిప్పు అనుకున్న
నింగి, నేల, నీరు రోజురోజుకూ
తరిగి తరిగి వేసారి సన్నగిల్లి
నిప్పులాంటి మనిషికై నిత్యం
అన్వేషిస్తున్నది ఈ అవని.
మనిషి అంతరంగాన అంతరాలను
ఎ.ఐ నిజమయ్యేలా తలపిస్తుంటే
కళ్ళ ఎదుట కాలం మబ్బులకు
సాక్ష్యం తనే అని తెలుస్తున్నా...
కళ్ళకు పట్టిన మబ్బును చెరపడు!
నీటి మూటల మాటలతో
నిర్మించుకున్న నీ చదరంగపు ఆటలో
నీ తరాలకు నీవిచ్చే, మిగిల్చే
ఖాళీ గడులు మనుగడ కొనసాగించునా!
అసలు గడులే ఉండవని తెలుసుకో!!
- డా. చిటికెన కిరణ్ కుమార్
94908 41284