అరక్షణం వృధా చేయకుండా
ఆకాశాన్ని చుట్టిరా..
అనంతం నీకోసం హస్తాలను
చాచి మరీ ఎదురుచూస్తుంది!
మదిని చెరిచే ఆలోచనలను
అల్లంత దూరంగా విసిరేసి
అంబుధి చుట్టూ ఆనందంగా విహరించు..
కష్టాల కల్లోలం నీ హస్తరేఖ లాంటిది
వదిలి వెళ్ళదు, దాచినా దాగదు..
సమయం మించి పోతుంది
కాలం పరుగులు పెడుతుంది
నీ పాదాలకు పని చెప్పు
నీ ఆశల పురివిప్పు..
ఒక్కోక్షణం అవ్వాలి మరువలేని అద్భుతం
మదిన దాగిన ఆలోచనలకు ఆయువు పోసి
కొత్త కొత్త ఆశయాలకు పురుడు పోసి
ఈ విశాల ప్రపంచంలో దర్జాగా తిరుగు
ఆపేది ఎవరు నిన్ను...!!
-పోలగాని భాను తేజశ్రీ
98665 97260