తొలి క్షణమే సాక్షి సంతకంగా....

poem

Update: 2023-09-03 18:30 GMT

రోడ్లు నిద్ర లేవక ముందు

నడక మేల్కొని

ఒళ్ళు విరచుకున్న నీ జ్ఞాపకాలు

చురుకుగా నాపై చేతులేసి

రోజులో తొలి క్షణాలను

ప్రేమగా నిమురుతుంటే

వడి వడి అడుగుల సవ్వడితో

వాడి వాడిగా పలుకులు

వేకువ ఒడిలో పడి మొలిచి

మసక వేళలో ఇష్టం ముసుగు తీసుకుని

ముసురుపట్టిన ఆలోచన మగత తొలిగి

చల్లని గాలి కెరటాల మధ్య

నుదుటపై జారిన చెమట చుక్కల చిందు

నాలుకపై జారిన వెచ్చని కవిత బొట్ల విందు

నీ పేర అనుభవ ఆస్తులుగా

రోజులో తొలి క్షణమే సాక్షి సంతకంగా

తొలి ఊహకు ఊపిరిదే..

శ్రీ సాహితి

97044 37247

Tags:    

Similar News

వెలుగు

పగటి వేషం