వెనుకబడిందెవరు
వెనుకబడినోళ్లు ఎవరు
లెక్కలేనోళ్లా
లెక్కకు రానోళ్ళా
చైతన్య నేత్రాలతో
సామాజికదర్శినిలో వీక్షించాలి
బానిసత్వ వేదికపై
దోపిడి ప్రదర్శించే
రాజకీయ ఇంద్రజాలంలో
ఇంకెంతకాలం ఈ ప్రేక్షకానందం
ఆలోచించండి....!
అడుగేయండి......!!
ఉత్పత్తి కులాలు
ఉత్త కులాలు ఎందుకైనయి
పుట్టుమానసిక దోపిడి కాదంటారా
నాయకత్వలేమి లేదంటారా
ఆలోచించండి...!
అడుగేయండి......!!
ఓట్లు అడుక్కునేటోన్ని
సీట్లు అడుక్కునుడంటే
ఆకుల అన్నమేసేటోళ్లు
మూతులు నాకడానికి ఎగబడడమే
యిదెంతటి నీచమానసిక దౌర్భల్యం
ఆలోచించండి....!
అధికారంకై అడగేయండి.......!!
ఓటు మనది
సీటు మనది
అధికారం కూడా మనదే
ముమ్మాటికి మనదైతీరాలి
జినుకల వెంకటేష్
96520 92120