చక్కగా సాగుతున్న బోధనకు బ్రేకులు పడ్డాయి.. వెనక్కి తిరిగి చూశాడు.. ఒకరిద్దరు పిల్లలూ మాట్లాడుతూ కనిపించారు. ఊరికే టైంపాస్ కోసం వస్తే లాభం లేదు. కష్టపడితేనే మంచి ఫలితాలు వస్తాయి మీ వయసున్న పిల్లవాడే ఎంత కష్టపడ్డాడో తెలిపే కథ ఒకటి చెబుతాను వినండి. అలా అనడంతోనే పిల్లలందరూ నిశ్శబ్దాన్ని కౌగిలించుకున్నారు. ఉత్తానపాదుడు అనే రాజుకు ఇద్దరు భార్యలు. చిన్న భార్య అంటే అతనికి చాలా ఇష్టం. పెద్ద భార్య వద్దకు ఎక్కువగా వెళ్ళేవారు కాదు.పెద్ద భార్య కొడుకు ధృవుడు. తండ్రిని చూడటానికి పినతల్లి ఇంటికి వచ్చేవాడు. ఒకరోజు చిన్న భార్య కొడుకు తండ్రి తొడపై కూర్చొని ఆడుకుంటుండగా, ధృవుడు చూశాడు. వెంటనే తను ఇంకో తొడపై కూర్చోవడానికి వెళ్ళాడు. ఇది గమనించి నీకా అర్హత లేదు అని పినతల్లి గర్జించింది. తండ్రి భయపడ్డాడు. ధృవుడు దు:ఖంలో వెళ్ళిపోయాడు. ‘తండ్రి ఆదరించలేదని దు:ఖపడతావెందుకు. ప్రపంచానికే తండ్రి లాంటి భగవంతుని ప్రేమ పొందడానికి తపస్సు చేయి’ అని తల్లితో బోధించింది.
అందరివద్ద సెలవు తీసుకొని, దేనిపై ధ్యాస నిలపకుండా, కేవలం తపస్సుపై మనసు లగ్నంచేసి, తను అనుకున్నది సాధించేవరకు ప్రయత్నించాడు. అతని దీక్షకు మెచ్చి భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. తండ్రి ప్రేమను, రాజ్యభారాన్ని అందుకొని పాలన చేయుమని వరమిచ్చి పంపించారు. ఈ రోజు నక్షత్రమండలంలో కనిపించే ధృవతార ఆనాటి ఘోర తపస్సు చేసిన ధృవుడే. మీ వయసే కలిగిన అతను కష్టించాడు కనుకనే చిరంజీవి అవతరించారు. మీరు కూడా కష్టపడితేనే ఫలితం ఉంటుంది. అని ముగించాడు బుంగి.
కష్టమనకను చదువుల కడకు సాగి
ఎదిగి నిలచిన పలువురు ఎంచి చూసి
ప్రస్తుతింతురు ధృవులాగా ప్రస్ఫుటముగ
కశప చెప్పిన కధనమ్ము కాంతి పధము
డా. బి.వి.ఎన్ స్వామి
92478 17732