అబద్ధాలు సిగ్గుపడుతున్నాయి

poem

Update: 2023-08-20 18:30 GMT

అబద్ధాలు నవ్వుకుంటున్నాయి

ఉద్యోగాల కల్పననే

మాట వింటూ...

విదేశాలకు వలస వెళ్ళిన

యువతను చూసి

అబద్ధాలు

నివ్వెర పోతున్నాయి

అర్ధ సత్యాలు అసత్యాల

సంగమం చూసి

అబద్ధాలు

ఈర్ష్య పడుతున్నాయి

నల్లధనం వెనక్కి రాకున్నా

తిరిగి అధికారంలోకి వచ్చిన

తంతును చూసి

అబద్ధాలు

కొత్త పాఠాలు నేర్చుకుంటున్నాయి

నిబద్ధత కోల్పోయిన

అబద్ధాల్ని చూస్తూ

అబద్ధాలు

సిగ్గుపడుతున్నాయి

కొత్త అర్థాలకు

నిఘంటువులను

వాళ్ల దగ్గర వెదుకుతూ....

- గోలి మధు

Tags:    

Similar News

వెలుగు

పగటి వేషం