చంద్రయాన్... నగ్నయాన్

Poem

Update: 2023-08-21 00:30 GMT

ఎటుపోతోందో.. మనదేశం

'చంద్రయాన్' ఒకవైపు

'నగ్నయాన్' మరోవైపు..

పురోగమన భారతమా...

తిరోగమన శకమందామా...!!

మధ్యయుగాల నీతి

నవనాగరికతకు అద్దుదామా..

రాజదండాల సూక్తి

ప్రజాస్వామ్యానికి దిద్దుదామా!

'అద్దాల మేడలు కావ'న్నాడు కదా

బాపూజీ అభివృద్ధికి చిహ్నాలు..

ఆకాశహర్మ్యాలు

ఆకలి సూచీలు నేడు

ఒకే రేఖపై సమాన

పరుగులు తీస్తున్నాయి..

పెంచి పోషిస్తున్న

భావ దారిద్ర్యం

మెదళ్ళలో నాటుతున్న

'సద్భావనా శూన్యం'.

ప్రగతి రథచక్రాలు

పదడుగులు ముందుకెళుతుంటే...

అవినీతి, అమానుష అనైతిక జాడ్యాలు

వందడుగులు వెనక్కి తోస్తున్నాయి..

ఎటు పోతోందో.. నాదేశం.

ఏమౌతుందో స్వతంత్ర భారతం ...

శ్రీనివాస్ కాలె

90594 50418

Tags:    

Similar News

వెలుగు

పగటి వేషం