గాయాల పురిటి

Poem

Update: 2023-08-06 18:30 GMT

నవ్వుకునే గాయాల

బాధలన్నింటికీ వీడ్కోలిస్తున్నాను

దుఃఖాన్ని విచిత్రంగా చూస్తే

దూరాన్ని వెతుక్కొని రగిలిచ్చే

నిఘంటువుల్లో కెక్కని గాయం

పెద్దదిగా ఎలా ఉందో చూస్తున్నాను

మనసు పత్రహరితంలా కాలిపోతున్న

గుండె చప్పుళ్ళకి

కనిపిస్తున్న ఉరితాడులై

వ్యవహార సందిగ్ధం ఎలా చెప్తారు?

అంతులేని సృష్టి మథనాన్ని

మూసుకుపోయినట్లు తెగొట్టుకున్నాయ్

గుండె గాయాన్ని తాకేటట్లు

పొలిమేర నడుమ బిగపట్టినట్లు

ఎప్పుడో ఒకరోజు వెలుగే తిరా రేఖ మిగిలే ఉంది

గాయాలని వెతకాలంటే

దారులన్ని మూసుకుపోయినాయ్

అన్ని కాంక్రిట్ బాటలే

ఉరివెంట వీడియోస్ చూస్తున్నట్టు అనిపిస్తుంది

ఒకనొక సందర్భంలో

కొమ్మరాలిన జ్ఞాపకాల పూలనడుగు చెప్తాయ్

గాయాలు మనకేం తెలుసు

శిధిల వ్యవస్థ గాయమే సందిగ్ధం

ఏదో ఒకరోజు నిక్షిప్తం అవుతుంది

గాయమనేది ఉందా అని

ప్రయోగాత్మక హెచ్చరికలు జారీ చేస్తుంటారు

గాయానికి మించిన నిజ నాయకుడు లేడు

అప్పుడెప్పుడో దిక్కులు కోల్పోయినప్పుడు

గాయం ఏం ఎరగనట్లు నటిస్తుంటారు

కథల మత్తుల్లో కూరుకుపోయిన

ఎముకలు కుళ్ళిన శవంలా ఉండకపోవచ్చు

మహాదుర్మార్గం అని నేనే అని మురిస్తే

తగ్గిన గాయం నాగరిక

జీవంల మటుమాయం కాకపోవచ్చు

రెక్కల దారుల్లో కిటికీ లోపాల్లో నుంచి

పీచులు పెడుతూ ఉంటారు

మనుషుల కోసం మేలుకొలిపిన

ఎదురు చూపిన నిబ్బరం

సత్కారాలతో ఆరగింపులు మొదలైనాయ్

కొత్త కీర్తిని రెప్ప చాటున వెతుకుతున్నప్పుడు

విప్లవ ఛాయని సృష్టిస్తుంది

బూర్గు గోపికృష్ణ

-79958 92410

Tags:    

Similar News

వెలుగు

పగటి వేషం