వానకాలం వానమాటలు
ఋతు పవనాలు ఒక వైపు
తుఫాను తీవ్రత మరోవైపు
ఊరు చెరువులు నిండుకుండలు
వరిపొలాల్లో ఇసుక మేటలు
నారుమడుల్లో చేపల జలకాలు...
పూరి గుడిసెలు మునిగిపోయాయి
పక్కింటి దాబాపై పేద బతుకులు
ఎక్కడా గేదల జాడ లేదు
కాళ్లరిగి తెచ్చుకున్న ప్రభుత్వ కాగితాలు
నీటిలో పడవల్లా తేలిపోయాయి
గ్యాస్ సిలిండర్ పడవల్లా
సాగిపోతున్నాయి ఏక వస్త్రాల తో
సగం మోకాళ్ల నీటిలో జనం...
ఎవరోవస్తారని ఆశ లేదు
పోయిందంత ఇస్తారని భరోసా లేదు
కాలంతో పోటీపడి నడవాలి
కలోకంజో తాగి బతకాలి
కీలెరిగి వాత పెట్టాలి
రేడియమ్
92915 27757