యుద్ధం శరణం గఛ్చామి..!

Poem

Update: 2023-08-06 18:30 GMT

నాకిది అవసరమై కావాలని,

నేనడిగినప్పుడే నువ్విచ్చేయాలని,

నేను చెప్పిందే నువ్వు వినాలని,

పెద్దోడు చిన్నోడిపై బాణం ఎక్కుపెడితే

యుద్ధం శరణం గఛ్చామి..!

నా ఇష్టంతో సంబంధం లేకుండా

నీవడిగింది చేసేయాలని

నువ్వు గీసిన గీతను దాటొద్దనే

పెద్దోడిపై చిన్నోడు తిరగబడితే

యుద్ధం శరణం గఛ్చామి..!

నీ దారుల వెంట నేనున్నానని

తగలబడిన దేశం సంపదపై

చలి మంటలు కాచుకుంటూ మూడవ వాడు

మొసలి కన్నీరు కార్చుతూంటే

యుద్ధం శరణం గఛ్చామి..!

ఎవరి బలాబలాలు వారివి..

ఎవరి బలహీనతలు వారివి..

కలబడ్డ సైనికుల సాక్షిగా

సమిధలౌతున్న ప్రజలు మేలుకోకుంటే

యుద్ధం శరణం గఛ్చామి..!

కోల్పోయిన ప్రాణం విలువ

వీడిపోయిన రక్తసంబంధాలు

కుటుంబాలు చెల్లిస్తున్న దుఃఖపు మూల్యం..

భారమై ప్రతీకారానికి ప్రజ్వరిల్లుతే

మళ్లీ యుద్ధం శరణం గఛ్చామి..!!

(రష్యా – ఉక్రేయిన్ యుద్దానికి సంవత్సర కాలం ముగిసిన నేపథ్యంలో ..)

డా. వాసాల వరప్రసాద్,

9490189847

Tags:    

Similar News

వెలుగు

పగటి వేషం