అంతరంగంలో నిలిచిన స్వప్నం.!

Poem

Update: 2023-07-30 18:30 GMT

ఉత్సాహంగా మొదలైన ఉదయం

సాయం పొద్దు వాలే సరికి

ఎన్నో మనోభావాలకు సాక్షీ భూతమై

రాతిరి గాయాల శిలువను మోసుకొస్తుంది..!

ఎడారిలో ఒయాసిస్సును

వెతుకుతూ జీవన పోరాటం

మరిన్ని వృత్తాలను నిర్మిస్తూ

గమ్యం లేని ప్రయాణమయ్యింది..!

సిటీ ట్రాఫిక్ జామ్ లను దాటి

ఏకాకిగా మిగిలిపోయిన అలసట

ఆకాశం నుండి జారి

చిటారు కొమ్మపై వాలింది..!

అయినా గడిచిన కాలం నుండి

అంతరంగంలో నిలిచిన స్వప్నమొకటి

చీకటిని వెలుతురు ఖడ్గంతో చీల్చుతూ

చైతన్యమై ముందుకు నడిపిస్తోంది..!!

- డా. వాసాల వరప్రసాద్,

94901 89847

Tags:    

Similar News

వెలుగు

పగటి వేషం