ముసుగులు తొలుగుతున్నై

Poem

Update: 2023-07-30 18:30 GMT

కొండమల్లెల మోముపై

చిప్పిల్లిన రక్తమేవరిదో ...

పంట చేలను కోస్తున్న

కిరాయి కత్తెవరిదో...

కనుక్కుంటారా

అడవిపై మారణ హోమం చేస్తున్న

చేతులెవరివో...

ఆకులపై అత్యాచారం చేసిన

ముల్లులెవరివో ...

కాసింత చెబుతారా

దేశం కోసం ఘోషించే నోళ్ళన్ని

మూగబోయాయెందుకు

మీ మౌనం మాపై దాడులకు

అర్ధాంగీకారమా

మాకే భ్రమలు లేవిప్పుడు

ఏ ఓదార్పు గీతాలు ఆలపించకండి

అయినా... మీ ఏలుబడిలో

న్యాయాన్ని కోరడమంటే...

మేకలు తోడేళ్లను కాపలా

పెట్టుకుని నిద్రపోవడమే

మేమిప్పుడు కాలిపోతున్నందుకు ఏ బాధా లేదు

మా చితిమంటల వెలుగుల్లోనైనా

మీ ముసుగులు తొలగి

దేశం నిజాన్ని చూస్తున్నందుకు

దిలీప్.వి

84640 30808

Tags:    

Similar News

వెలుగు

పగటి వేషం