ఎందుకిలా....?

poem

Update: 2023-07-30 18:30 GMT

వసంతాన్ని ఆస్వాదిస్తున్న వేళ

అవయవాలనే కాదు

అంతరంగాన్నీ నిలదీస్తున్నట్లు

ప్రకృతి సిద్ధమైన నా దేహంలో

దోచుకున్నది మానాన్నేనా?

నన్ను చుట్టిన మూకలో ఆ క్రూరత్వం ..?

ఆ మూకలో కొందరిని శిక్షించమని

మనస్సు కోరుకున్నా...

మసకబారిన దృశ్యం

స్పష్టమౌతున్నకొద్దీ...

ఇక్కడి ప్రకృతితో తీర్చిదిద్దబడిన

నా భావనలు

అనాదిగా ఉన్న ఆదివాసీనై

మాతృస్వామ్యాన్ని పదిలపరుచుకున్న

వ్యక్తిత్వంలా

విశ్వసనీయతను సంతరించుకున్న

సంస్కృతిలా

సామూహికతను ఎత్తిపడుతున్న

ఆత్మగౌరవంగా...

దాడి నా దేహం పైనేనా?

కాదు... కాదు...

నేను పెరిగిన ప్రకృతిపై...

సంస్కృతిపై.... వ్యక్తిత్వంపై...

సామూహికతపై.... ఆత్మగౌరవంపై...

నా నరనరానా పాకుతున్న

విద్యుల్లత ఘోష

న్యాయం కావాలని.......

( న్యాయం కావాలని ఆక్రోశిస్తున్న మణిపూర్‌ కోసం)

-ఉషస్సు

Tags:    

Similar News

వెలుగు

పగటి వేషం