ఏకరూపత

poem

Update: 2023-07-09 18:30 GMT

స్వరూపాలు వేరైనా

మనోరూపాలు ఒకటే‌‌...

హర్షానికి ఆవేదనకీ

కురిసే కన్నీటితడి ఒకటే...

మనందరం విడివిడిగా విభజించుకుంటాం

అంతరంగంలో అంతా ఒక్కటవుతాం..

స్వార్థం జడలు విప్పి నాట్యమాడినా,

సాయం వెయ్యి చేతులై వెన్ను తట్టినా

మనలో మనం ద్విముఖులం

నాణానికి బొమ్మాబొరుసులం..

ముఖానికి మేకప్ వేసి హొయలు పోతాం

నిర్మలమైన నవ్వు కోసం విఫలయత్నం చేసి విరమిస్తాం..

మనందరి దారులు వేరు వేరని వాదిస్తుంటాం

చివరికి అంతా 'మట్టే'నని వేదాంతం బోధిస్తాం..

మనమెవరికీ అర్థం కాము

మనల్ని మనమే అర్థం చేసుకోం

మనలోకి మనం ప్రయాణించం

విశ్వాన్ని మాత్రం కొలిచేస్తాం

సత్యాన్ని మాత్రం ప్రకటిస్తాం.

శ్రీనివాస్ కాలె

90594 50418

Tags:    

Similar News

వెలుగు