ప్రయాణం

poem

Update: 2023-07-09 18:30 GMT

చీకటి వెలుతుర్లను

చీల్చుకుని వెళ్తోంది రైలు

ముందే ఉందో, వెతుక్కుందో

ఇంకా వెతుకుతూనే ఉందో గానీ

గమ్యమేదో చేరేదాకా నిదానించేలా లేదు

ఆగని పెట్టెల్లోకి దూకేస్తున్నాయి అనుభవాలు

క్రిక్కిరిసి వున్నా లెక్కచేయని ప్రయాణీకుల్లా

ఎక్కే అనుభవాలే కానీ

ఎక్కడా దిగే జ్ఞాపకాలు ఒక్కటైనా లేవే!

బరువెక్కిన బోగీలేవీ

క్షణమైనా పరుగేమీ ఆపలేదు..

కర్మ యోగుల్లా.

అయినా రైలాగినా,

పయనమాగేలా లేదు పట్టాలున్నంత దాకా.

- డా. డి.వి.జి.శంకర రావు,

94408 36931

Tags:    

Similar News

వెలుగు