తూటాల వర్షంలో
రక్తసిక్తమైన బట్టలతో
ఎముకలు కొరికే చలిలో
తుపాకీ పేలుళ్ల శబ్దంలో
శత్రుసైన్యం పై విరుచుకుపడి
విజయపు బావుటా ఎగరేసి
తగిలిన గాయాలకి ఒక వైపు
చచ్చుబడిపోతున్న శరీరంతో
శక్తిని కూడగట్టుకుని
ఒకే ఒక మాట ఒళ్ళు పులకరించేలా,దిక్కులు పేక్కటిల్లేలా
జై హింద్ అంటూ
భారతావని ఒడిలో సొమ్మసిల్లుతూ నేను
కలయో లేక నిజమో !
నన్ను పలకరిస్తున్న త్రివర్ణ పతాకం
ఆ హిమాచల గగనాన
పౌరుషపు మీసాలు మెలవేసినట్లు
జెండా రెపరెపలాడుతూ
చిరునవ్వులు విరబూస్తుంది
కన్న తల్లి తండ్రులు పక్కనే
వందనాలు సమర్పిస్తూ
కన్నీటి సంద్రంతో
దేశ రక్షణ లో గాయపడిన నన్ను చూస్తూ
గర్వంతో ఒక పక్క నాన్న
మరోపక్క ఏమవుతానోనన్న బాధతో
ఆ రెండిటి భావోద్వేగాల మధ్య కన్నీళ్లు
ఇంకోవైపు అమితమైన ప్రేమతో అమ్మ
చెమర్చిన కళ్లతో నా పక్కన
గుండెలు పగిలే రోదనలో భార్య
ముక్కుపచ్చలారని పసిపాప ఆడుకుంటూ ఆరుబయట
ఇంతలో స్పృహలోకి వచ్చా
అమ్మ,నాన్న,భార్య లో చిగురించిన ఆశ
ప్రాణాపాయం లేదని
నాలో చిగురుంచిన ఆశ మళ్ళీ దేశ సంరక్షణలో,
సరిహద్దులలో వీర సైనికుడిలా అవ్వాలని,అవుతానని ...!
ఆర్. నవజీవన్ రెడ్డి
9742377332