ఆమె ఉదయం లేచి ముగ్గులు వేసింది. దాహం వేసి కడుపునిండా నీళ్ళు తాగి పడుకుంది. అతను వచ్చి లేపాడు. ఆమె నిద్రలోనే కన్నుమూసింది. ఘొల్లుమన్నాడు. ఇరుగు-పొరుగు వచ్చారు. కన్నీరు కార్చారు. సానుభూతి పలికారు. గుండెపోటన్నారు. తన దారిన తాను వెళ్లిందన్నారు. కష్టపడలేదు. కష్టపెట్టలేదు. మంచి చావన్నారు. కోటికొక చావు, అదృష్ట చావు, ముత్తయిదువ చావు, ఖర్చులేని చావు, జబ్బు పడలేదు, మంచం సేయలేదు, ఆసుపత్రిలో అడుగుపెట్టలేదు, తన చావు తాను చచ్చిందన్నారు. పలురకాలుగా ప్రశంసించారు.
‘చూశావా సహజ మరణాన్ని ఎలా ఇష్టపడుతున్నారో’ అన్నాను.
‘వయసుడిగి ఆరోగ్యంతో చనిపోవడమే సహజ మరణం. ఇప్పుడిలాంటివి తక్కువ. ప్రతీ ఇల్లూ రోగాల పుట్టయింది’.
‘ఈమెది ఆత్మహత్య అంటావా?
‘ఆస్పత్రుల పాలై, అప్పుల పాలై, సేవల పాలై, మనసు, శరీరం, కష్టాల పాలై, ఇంటిల్లిపాది అవస్థల పాలైనవాడు జీవచ్ఛవంతో సమానం. జబ్బుల పాలపడక, కొద్ది బాధలతో చనిపోయినవాడే సుఖపడినట్లు’
‘మనం కోరుకున్నట్లు చావు వస్తదా’?
బుంగి మౌనమే సమాధానమయింది.
సకల మర్యాద నశియించు జబ్బు పడిన
జబ్బు బారిన పడుకున్న జరుగు మేలు
జబ్బు దూరని చావును జగము తలచు
కశప చెప్పిన కధనమ్ము కాంతి పధము.
డా. బి.వి.ఎన్ స్వామి
92478 17732