అసమానత్వమే
ఆదర్శమని భావించే వారికి
ఎలా రుచిస్తుంది సోషలిస్ట్ పదం
మత రాజ్యం
కోసమే పాటుపడేవారికి
వెగటు అనిపించదా సెక్యులర్ పదం
మను ధర్మాన్నే
ఉపాసించే పరాన్న జీవులకు
మింగుడు పడుతుందా రాజ్యాంగం
ముందు పదాలనూ
అటు తరువాత ఆ ఆదర్శాలనూ
బొందబెట్టడమేగా అసలైన లక్ష్యం
ఊ ..
ఇప్పుడిక
కొట్టండి చప్పట్లు
వెలిగించండి దీపాలు
పనిలో పనిగా
సిద్ధం చేసుకోండి
పాడెనీ సమాధినీ
- రత్నాజయ్