డిగ్రీలన్ని మూటగట్టుకొని,
పుస్తకాలన్ని చేతబట్టుకొని,
భాదలన్ని అనగదొక్కుకొని
బాధ్యతలన్ని భుజానకెత్తుకొని,
నిరంతరం పరుగెత్తే ఓ నిరుత్సాహ నిరుద్యోగి
సంబరాలన్ని బందువెట్టుకొని,
సత్తువనంత కూడగట్టుకొని ,
ఆశయాలన్ని ముందువెట్టుకొని,
అవకాశాలన్ని అందిపుచ్చుకొని,
పట్టువదలక ప్రయత్నిస్తే..
నువ్వేనోయి నిలువుకీర్తి.
భయాలన్ని చుట్టుముట్టనీ..
బంధువులంతా వెక్కిరించనీ..
బలహీనతలే వెనక్కిలాగనీ..
ఈ ప్రపంచమే కృంగదీయనీ..
ఆత్మవిశ్వాసమే నీవెంటుంటే
అదే నీకు ఆయుధమోయి.
ఇది డూ ఆర్ డై కాలం కాదు,
డూ బిఫోర్ డై.
ఇది గెలుపోటముల ఆట కాదు,
గెలిచి రాయాల్సిన పాట.
ఇది రెప్పపాటున స్వప్నంకాదు,
యువత జీవిత ఆశయం.
చేయి దాటితే మళ్ళీరాదోయి చరిత్రలో నిలిచే ఈ సమయం,
ఒక్కసారి గెలిచిచూడు
లక్షల నిరుద్యోగుల స్వప్నం.
వెంకటేష్ కే విశ్వ
9553762108