మలుపు - పుస్తకావిష్కరణ సభ... అక్టోబర్ 19న
ప్రముఖ పుస్తక అనువాద ప్రచురణ సంస్థ 'మలుపు' శనివారం మరో రెండు పుస్తకాలను ఆవిష్కరించబోతోంది.
దిశ, వెబ్ డెస్క్ : పదిహేను సంవత్సరాలుగా అనువాద ప్రచురణ రంగంలో 50కి పైగా పుస్తకాలు ప్రచురించిన సంస్థ మలుపు బుక్స్. ఈ సందర్బాన్ని పునస్కరించుకుని శనివారం (2024 అక్టోబర్ 19) సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతి మినీ హాల్, హైదరాబాద్‌లో పుస్తకావిష్కరణ సభ జరుగనుంది. సాహిత్య విమర్శకులు ఏకే ప్రభాకర్ సభకు అధ్యక్షత వహిస్తారు. ఈ సభలో ఓల్గా అనువదించిన పోటెత్తిన కెరటాన్ని పుస్తకాన్ని ప్రముఖ రచయిత, కాలమిస్టు ఆకార్ పటేల్ ఆవిష్కరిస్తారు. ఎన్ వేణుగోపాల్ అనువదించిన నియంత అంతం పుస్తకాన్ని ప్రముఖ రచయిత్రి గీతా హరిహరన్ ఆవిష్కరిస్తారు. ఆంధ్రజ్యోతి సంపాదకులు కె. శ్రీనివాస్, నవలా రచయిత్రి కెఎన్ మల్లీశ్వరి ప్రసంగిస్తారు. రచయితలు, అనువాదకులు స్పందిస్తారు. ఈ ఆవిష్కరణ సభను మలుపు బాల్ రెడ్డి నిర్వహిస్తారు.
మలుపు బాల్ రెడ్డి
98665 59868