ప్రవక్త జీవితంపై 'శంకరాచార్య' పుస్తకం

Mahammed Pravaktha Book Review

Update: 2024-09-15 18:45 GMT

మానవత్వానికి పెద్ద పీట వేసి మానవాళిని సన్మార్గంలో నడపడానికి ఆవిర్భవించిన మతం ఇస్లాం. అయితే ఈ మత ఆవిర్భావం, వ్యాప్తి ఎన్నో సవాళ్లు, ఆటంకాలను ఎదుర్కొన్నది. కానీ ఇస్లాం మత వ్యవస్థాపకుడు మహమ్మద్(సఅసమ్) మొక్కవోని దీక్ష, సహనం వల్ల అది విశ్వవ్యాప్తమై మానవులకు సుఖ శాంతులను ప్రసాదించింది. మక్కాలో ఇస్లాం వ్యాప్తిని అడ్డుకోవడానికి ఖురైషులు చేసిన దౌర్జన్యాలను మహమ్మద్(సఅసమ్) ధైర్యంగా, సహనంతో, దయతో ఎదుర్కొన్న తీరు తెలుసుకొంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన శత్రువులను సైతం దయతో మన్నించి సంస్కరించిన తీరు నేరగాళ్ల సంస్కరణకు మార్గదర్శకంగా నిలుస్తుంది.

తాను చేసిన ప్రబోధనలను ఆయన ఆచరించి చూపిన తీరు మన జీవితాలకు మార్గదర్శకత్వం వహిస్తుంది. ‘పేదవాడైనా భిక్షాటన చేయకుండా స్వాభిమానంతో జీవించేవారిని అల్లాహ్ ప్రేమిస్తాడు’; ‘పెద్దలను గౌరవించనివాడు, పిల్లల పట్ల వాత్సల్యంతో మెలగనివాడు ముస్లిం కాడు’; ‘చాడీలు చెప్పేవాడు స్వర్గంలో ప్రవేశించలేడు’; ‘దారిలో అడ్డంగా పడి ఉన్న వస్తువును తొలగించడం కూడా సత్క్యార్యమే’.. లాంటి ఆణిముత్యాల్లాంటి ఆయన బోధనలు మనలో ఆత్మ విశ్వాసాన్ని, నైతిక నిష్ఠను పెంచుతాయి. ఇస్లాం ఆవిర్భావం, వ్యాప్తి; మహమ్మద్(సఅసమ్) జీవనం, ఆయన బోధనలకు సంబంధించిన మరెన్నో తెలుసుకోదగిన విషయాలను ఈ పుస్తకం వివరిస్తుంది.

(నేడు మిలాద్ – ఉన్-నబీ సందర్భంగా)

పుస్తకం: మహమ్మద్ ప్రవక్త (సఅసమ్) చూపిన జీవని, ప్రబోధనలు

రచన : స్వామి లక్ష్మీ శంకరాచార్య,

అనువాదం : పద్మావతి.పి.

ప్రచురణ : తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ ట్రస్టు

పేజీలు : 32, వెల : ఉచితం,

ప్రతులకు : 040-45723000 సంప్రదించండి.


సమీక్షకులు

ముహమ్మద్ ముజాహిద్,

96406 22076

Tags:    

Similar News

అమరత్వంపై