కౌ, కాబ్లర్‌ & హమ్జా ! - గీతాంజలి

డిసెంబర్ 6న బ్లాక్ డే సందర్భంగా రచయిత్రి డా. గీతాంజలి రాసిన కథ

Update: 2024-12-06 05:45 GMT

దిశ, వెబ్ డెస్క్ :  “ఛ... మేం చంపలే అని మధుకర్ అంటున్నా... అరె నేనే సాక్ష్యం కదా... నా

తమ్ముడు లక్ష్మణ్‌ నా కళ్ళ ముందే కరెంట్‌ షాక్‌ తగిలి చనిపోయాడు. గిలగిలా కొట్టుకుంటూ

కొంచెంలో నాకు తప్పింది లేకపోతే నేనూ చచ్చిపోయేదే గీత తో పాటు.”... కళ్ళల్లో నీళ్ళు

కారుతుంటే దుఃఖంతో మూలిగాను గీతావు అక్కనైన నేను సీతని .

“అన్నా కొట్టకు,. చచ్చిన ఆవునే తోలు తీస్తున్నాం మేం చంపలే అన్నా... కరెంట్‌

షాక్‌ తగిలి సచ్చిపోయింది అన్నా... ఆవు మాది కూడా కాదుసెట్ ది అన్నా! కావలిస్తే ఈ

సేట్‌ను అడుగు" మధుకర్‌ గజగజ వణికుతున్నాడు. ‘‘అన్నానువ్వన్నా చెప్పన్న ఈ

చచ్చిన ఆవు నీదని’’ మధుకర్‌ కూరగాయలమ్ముకునే సేట్‌ రామ్‌లాల్‌ కాళ్ళమీద

పడబోయాడు. కానీ ఒళ్ళంతా రాడ్లతో పొడిచి అణువణువూ గాయాల పాలవడంతో పక్కకి

ఒరిగిపోయాడు...

“అమ్మా” అంటూ నొప్పితో మూల్గాడు మధుకర్‌... “గో మాతాకి జై” అక్కడ వందల

సంఖ్యలో గోరక్షకులు పిచ్చెక్కినట్లు రౌద్రంగా అరుస్తున్నారు. ఆ వీధి జనం భయంతో

చూస్తున్నారు.

నేను విలవిల్లాడాను .

అంతే ఒక్క సారిగా నేను ఆ మూక నాయకుడి దగ్గరికి పరిగెత్తాను. “అవును... నేను

చూసాను.. నా చెల్లి గీతని చంపింది మధుకర్‌ కాదు కరెంట్ షాక్ తగిలి చనిపోయింది

మధుకర్ ని వదిలేయి” నేను గొంతు చించుకుంటూ తల గుండ్రంగా... నిలువుగా వేగంగా

తిప్పుతూ కాళ్ళు తపతపా నేలకు కొడుతూ అరిచాను. కానీ దాని భాష ఎవరికీ అర్థం కాలేదు.

ఇదంతా పోలీస్‌ స్టేషన్‌ ముందే జరుగుతుంది. ఇంతలో అక్కడికి గతేడాది మేక మాంసం

టిఫిన్‌ బాక్స్‌లో తీస్కెళుతుంటే బర్రె మాంసం తీస్కెళుతున్నారని కొట్టి చింపేసిన రెహమాన్

కొడుకు హమ్జా వచ్చాడు. హమ్జా, మధుకర్‌ మంచి దోస్తులు. హమ్జా దుఃఖంతో కింద పడి

నొప్పితో విల విల్లాడుతున్న మధుకర్‌ని లేపుతూ మరో దెబ్బ పడకుండా అతన్ని తనకి

అదుముకున్నాడు. “ఒరేయ్ మధుకర్ ఈ హమ్జా అబ్బాకి పట్టిన గతే నీకు పడుతుందిరా

ఒరేయ్‌ హమ్జా తప్పుకోరా’’ అంటూ ఆ ముటా నాయకుడు అక్కడి పోలీసులకి సైగ చేస్తుంటే.,

ఇద్దరు పోలీసులు లాటీలతో హమ్జాను వీపు మీద కొడుతూ మధుకర్‌ నుంచి బలవంతంగా

విడదీస్తున్నారు. వాళ్ళ కౌగిలి ఎంత బలంగా ఉందంటే ఆ పోలీసుల బలం సరిపోవడం లేదు.

“అరె ముందు ఈ సాయబుగాణ్ణి సంపండి రా కాటో.. మారో ” అక్కడ కాషాయ రంగు బట్టల్లో

చేతిలో రాడ్లు కర్రలతో కాలుతున్న మంటల్లా భగభగలాడుతూ ఉన్న మూకలోంచి పెనుకేకలు

వినిపించాయి. ‘‘పవిత్రమైన గోమాతను చంపుతావట్రా ఎంత ధైర్యం నీకు కట్టండ్రా... ఆ కొబ్బరి

చెట్టుకి’’ వాళ్లు హమ్జాని పక్కకి తోసేసారు.

‘‘అయ్యో... అయ్యో... మధుకర్‌ చంపలేదు. ఈ సేటే తోలు వలవమన్నాడు ఎప్పుడూ

జరిగేదె కదా మా ఆవులు చస్తే మధుకర్ నే పిలుస్తారు కదా’’ అన్నాను ఎర్రబడ్డ కళ్ళతో.,

చేతిలో రాడ్‌తో కోపంతో ఊగిపోతున్న ముఠా నాయకుడి దగ్గరకెళ్ళి ఆత్రంగా అతని

మొఖంలోకి చూస్తూ చెప్పాను... కళ్ళలోంచి ధారగా కన్నీళ్ళు కారుతుంటే ‘ఒద్దు... ఒద్దు

చంపకు వదిలెయ్‌ అతని తప్పు కాదు’’ అన్నా ఆందోళనగా. కొమ్ములతో అతని చేతుల్లోని

రాడ్‌ని కింద పడేసే ప్రయత్నం చేసాను. అతను నన్ను చూస్తూ “పాపం గీతావుని

చంపినందుకే ఏడుస్తున్నది” అనుకుని “బాధపడకు.. గోమాతా! చెల్లిని చంపిన ఆ మధుకర్ ని

వదిలేది లేదు వాణ్ణి చంపేస్తాం. గోమాతల రక్షణకే మేం ఉన్నది’ అంటూ ఆ ముఠా నాయకుడు

కొబ్బరి చెట్టుకు కట్టేసిన మధుకర్‌ దగ్గరికెళ్ళి రాడ్‌తో తల పగలగొట్టేసాడు పోలీసులంతా

కాపల కాస్తుంటే!అక్కడంతా ఉన్నజనం ఆక్రందనలు చేశారు.

వద్దు వద్దని ఆయన కాళ్ళ మీద పడి విల విల్లాడుతున్న మధుకర్‌ తల్లి,భార్యా పిల్లలు

గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు.

3

కాషాయ మూక తల పగిలి రక్తం ధారకట్టి స్పృహ తప్పిన మధుకర్‌ను చూస్తూ “జై

గోమాతా... జై గోరక్షక సమితి ...ఇలాగే చంపేస్తాం ఆవును ముట్టుకున్న వాళ్ళెవర్నైనా

ఖబడ్దార్‌” అని భీభస్తంగా అరుచుకుంటూ రాడ్లు, తల్వార్లు తిప్పుతూ వీరంగాలు చేస్తున్నారు.

నేను దుఃఖంతో, బాధతో, కోపంతో వణికిపోయాను . పరిగెత్తి ఆ మూకను

కుమ్మేయడానికి చూశాను. . ఒకడు కింద పడ్డాడు. “చూడండ్రా చూడండి,. గోమాత కూడా

ఆనందంతో నాట్యం చేస్తున్నది... జై గోమాతా... జై గో రక్షక సమితి” అంటూ అరుస్తూ

పడ్డవాడు లేచి మళ్ళీ నాట్యం చేసే గుంపులో కలిసిపోయాడు. ‘‘అయ్యో..’’ అంటూ నేను తల

బాదుకుంటూ ఏడుస్తూనే అక్కడ ఉన్న అందర్నీ అక్కడ దెబ్బలతో కాలు విరిగి కింద

పడిపోయిన హమ్జా కోసం... తల పగిలి రక్త శిక్తమై పోయి స్పృహ తప్పిన మధుకర్‌ కోసం

అంబులెన్స్‌ తెమ్మని పోలీసులని, అక్కడి మనుషులని వేడుకోసాగాను. హమ్జా భార్యా

పిల్లలు కూడా వాళ్ళ కాళ్ళమీద పడి హమజాని వదిలిపెట్టమని ఏడుస్తున్నారు.

“దుకాణం నుంచి మేక మాంసం తెస్తుంటే బర్రే మాంసం తెస్తున్నాడని అమాయకమైన

నా భర్తని చంపారు. ఇప్పుడు నా కొడుకుని చంపుతారా” అంటూ హమ్జా వాళ్ళ అమ్మీ

గుండెలు బాదుకుంటూ హమ్జాను లేపే ప్రయత్నం చేస్తున్నది. హమ్జా భార్య రజియా పిచ్చి

చూపులు చూస్తుంటే పిల్లలు “అబ్బా... ఉఠో” అంటూ ఏడవసాగారు. మధుకర్‌ భార్య తల

పగిలిన భర్తను చూసి స్పృహ తప్పిపోయింది. మధుకర్‌ తల్లిదండ్రీ గుండెలు బాదుకుంటూ

ఏడుస్తున్నారు.

ఇంతలో అంబులెన్స్‌ వచ్చింది. వర్షాకాలం...వర్షం మొదలై నేల మీది మధుకర్‌

రక్తాన్ని పలుచన చేస్తూ ముందుకు పారించింది. నేను దుఃఖంతో.. నిస్సహాయంగా

అంబులెన్స్‌ని వెనక నుంచి చూస్తుండిపోయాను. కాషాయ ముఠా నాయకుడు అక్కడే ఉన్న

పోలీస్‌ ఆఫీసర్‌ జేబు తడపడం చూస్తూ నేను ఆగ్రహంతో రగిలిపోయి వాళ్ళను పొడవడానికి

వాళ్ళ వైపుకి దూసుకెళ్ళాను. ‘‘ఈ ఆవుకి పిచ్చి లేసింది. ఇంత బక్కచిక్కినా గాని పొగరు

మాత్రం తగ్గలేదు తీస్కపొండిరా దీన్ని గోశాలకి’’ ముఠా నాయకుడు అరిచాడు. అంతే నేను

వాళ్ళలో ఒకడ్ని పొడిచి తప్పించుకుని పారిపోసాగాను. వెనక నుంచి “జై గోమాత, జై గోరక్షణ

సమితి’’ అంటూ అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి.

‘‘అన్యాయంగా ఆయన తల పగలగొట్టారు. అసలా ఆవుని ఎవరూ చంపలేదు. కరెంటు

తీగ తగిలి పోయింది. చేతులెట్లా వచ్చాయి మీకు ఆవు.. ఆవు అనుకుంటూ మనుషుల్ని

చంపుతున్నారు’’ వీధిలోని సీతాదేవి వాళ్ల మీద పెద్దగా అరిచింది. ‘‘ నిన్ను కూడా

వేసెయ్యమంటవా ఏంటి ఈ ముసలమాన్లను నమ్మద్దు ఈ రోజు ఆవులని

చంపుతున్నారు,రేపు మన హిందువులని చంపుతారు’’ అన్నాడు ముఠా నాయకుడు. “ఏం

కాదు అసలు మా గల్లీలలో ముసలమాన్లతో మాకెప్పుడూ ఏ సమస్యలు రాలేదు. పదేళ్ల

నుంచి ముస్లిమ్స్ తో కలిసి ఇక్కడి ఇళ్ళల్లో ఉంటున్నాం . ఏనాడూ వాళ్ళు మమ్మల్ని ఒక్క

మాట అనలేదు. మేము శాఖాహారులమని తెలిసి మాకు ఇబ్బంది లేకుండానే మాంసం

బయటనే వండుకుంటారు. వాళ్ళ దర్గాలకు మేం వెళితే మమ్మల్ని కులం, మతం బీదా

గొప్పా తేడాలేకుండా దర్గాల్లోకి ఆహ్వానిస్తారు, పీర్ల పండగ హిందువులదన్నట్లే

చేసుకుంటాము. గుళ్ళో కి రానివ్వడానికి మన హిందువులు కులం, మతం చూసుకున్నట్లు

చూడరు ఈ ముస్లిమ్స్. మన హిందువుల్లోనే ఈ జాతి, మతం, కుల తేడాలున్నాయి. మాకు

ఏ గొడవలు లేవు. మీకు కావాలి గొడవలు. అందుకే ఆవులని నాటకాలు మొదలు పెట్టారు.

ఆవు మీకు ఒక బహానా మనుషుల్ని చంపడానికి . ఇప్పుడా చచ్చిన ఆవుని మీరేగా

తీసుకెళ్లేది? వెళ్లండిక్కడి నుంచి అన్యాయంగా తల పగల కొట్టారు” సీతాదేవి ఆవేశంగా

రొప్పుతూ అంటుంటే , ఆమె వైపు చూస్తూ కోపంగా చూపుడు వేలిలో బెదిరిస్తూ... అదే

చూపుడు వేలుని తన పెదవులపై ఉంచి ‘‘నోర్మూస్కోని పో ఇక్కడినుంచి ’’ అన్నాడు.

‘‘నీకెందుకు సీతమ్మా పదా పోదాం”... సీతాదేవి భర్త ఆమెను చెయ్యిపట్టి బలవంతంగా

తన ఇంటి వైపుకి లాక్కెళ్లాడు.

మధుకర్‌ పిల్లలు... హమ్జా పిల్లలు... ఆ ఇళ్ల ముసలి వాళ్లు దుఃఖిస్తూ తమ ఇళ్ళ వైపు

కదలబారారు.

============

5

రాత్రి... కుండపోతగా వర్షం కురుస్తున్నది. దారి తెన్నూ లేకుండా నడుస్తూనే ఉన్నాను.

కాషాయ గోరక్షకుల నుంచి రక్షించుకోవడానికి పరిగెడ్తూ ఉన్నా...వాళ్ళె క్కడైనా కనిపిస్తే చెట్ల

వెనకాల, ఆటోల వెనకాల నక్కి నక్కి దాక్కుంటూ.. తప్పించు కొంటున్నాను. కరెంటు షాక్

తగిలి చనిపోయిన నా చెల్లి గీతావు దిక్కు లేకుండా అక్కడ పడి ఉంది. నిజానికి మధుకర్ ని

సేట్‌ పిలిచాడు తోలు వొలవమని మధుకర్‌ వంశం అంతా చెప్పులు కుట్టి బతికేవాళ్ళు.

ఊళ్ళో ఎక్కడ ఏ ఆవు చనిపోయినా మధుకర్‌ కుటుంబం వాళ్లు లేదా... బస్తీలో మరో

చెప్పులు కుట్టే మాదిగ కుటుంబం వాళ్ళను పిల్చుకునే వాళ్ళు. మధుకర్ తండ్రి వీరయ్య

తన తాతల కాలం నుంచీ ఆవు తోలు వలిచి చెప్పులు కుట్టే వంశ వృత్తి లోనే ఉన్నారు

ఇంకా. మధుకర్ ఇప్పటికీ వాళ్ళ నాన్న కుట్టిన చెప్పులే వేసుకుంటాడు. మా తోలుతో చేసిన

చెప్పులు కాళ్ళకి వేసుకుంటారు.. మళ్ళీ పవిత్రమైన గోమాత అంటారు.. మాత అయిన తల్లి

చర్మాన్ని కాళ్లతో ఎలా తాకుతారు అసలు? వీళ్ళ లౌక్యం తగలడా .. మెల్లిగా మధుకర్ ఇల్లు

చేరుకున్నా . సన్నగా దీపం వెలుగుతున్నది. ఊరునుంచి బస్తీకి వచ్చిన మధుకర్ నాన్న

ఆరు బయట దిగులుగా కూర్చొన్నాడు. కళ్ల నుంచి కారే నీళ్ళను కండువాతో తుడుచుకుంటూ

ముక్కు ఎగ బీలుస్తున్నాడు. నేను వెళ్ళి వీరయ్య ముందు నిలబడ్డాను. “ఎలా ఉన్నాడు

మధుకర్? ఆసుపత్రికి పోయావు కదా” అని అడిగాను. వీరయ్య ఒక్కసారి భళ్లుమని ఏడవడం

మొదలు పెట్టాడు. నా గుండె కరిగిపోయింది. నాకూ దుఖం వచ్చింది. ఊరుకో ఎడవకు..

మధుకర్,హామజా ఎలా ఉన్నారు” ? ఆత్రంగా అడిగాను. “బాగలేరు సీతావు తల్లీ సిరీయస్గా ఉంది

ఇద్దరికీ” అంటూ.. మళ్ళీ భోరుమని ఏడిచాడు. “సేఠ్‌ నన్ను రమ్మంటే జ్వరం తగ్గలేదు.

నువ్వు పండుకో నాయనా నేనే పొయేస్తా అంటూ కొడుకే బయలుదేరాడు సీతమ్మా.. ముందు

నువ్వు ఇక్కడికెళ్ళి వెళ్ళు వాళ్ళు ఇక్కడిక్కడే తిరుగుతున్నారు. వెళ్ళు సీతమ్మా వెళ్ళు

బిడ్డా వాన కొంచెం తక్కువ అయింది,. నా మధు ఎట్లున్నావు కొడకా” అంటూ వీరయ్య

కొడుకుని తలుచుకుని తలుచుకుని ఏడవసాగాడు. మధుకర్ బదులు వీరయ్య వెళ్ళినా

వీరయ్య తల కూడా ఇలాగే పగల గొట్టేవాళ్ళు కదా., వొట్టి అమాయకుడిలా ఉన్నాడు

అనుకున్నా. వర్షంలో ఎక్కడికెళ్లను ఇప్పుడు .. వీరయ్య తనని చూసి భయపడుతున్నాడు

వాళ్ళని ఎందుకు ప్రమాదంలో పెట్టటం? అక్కడే కొద్ది సేపు ఉండి వీరయ్యని వోదార్చి బయట

పడ్డాను.

=======

మరుసటి రోజు కూడా ఎడ తెగని వర్షం.... చెత్తకుండీల దగ్గర... అక్కడా ఇక్కడా గడ్డి

తింటూ అనాధలా తిరుగుతున్నా.

మధుకర్‌ ఇంటికీ... పక్క గల్లీలోని హమ్జా ఇంటికి తిరుగుతూనే ఉన్నా. అక్కడికెళ్ళి

వాళ్ళ మాట్లల్లో వీళ్ళ ఆరోగ్యాలు వాళ్ల మాటల్లో వింటూనే ఉన్నా. మధుకర్‌ ఆరోగ్యం

విషమిస్తోంది. హమ్జా కాలుకి స్టీలు రాడ్లు వేసారు ఇక నడవలేడని.

ఆ రోజు మధుకర్‌ ఇంట్లో రోదనలు మిన్నంటాయి. ఇంటి వాకిట్లో ఉన్న చంద్రాన్ని

అడిగాను. ఏమయ్యిందని... ‘‘ఏముంది మధుకర్‌ చనిపోయాడు’’ చంద్రయ్య దుఃఖిస్తూ

చెప్పాడు. నాకు భరించలేనంత దుఃఖం వచ్చింది.

మరోపక్క హమ్జా మంచాన పడ్డాడు. ఇంట్లో కుటుంబాన్ని పోషించేది హమ్జా ఒక్కడే .

అతనికి టైలరింగ్‌ షాప్‌ ఉంది. ఇప్పుడు కాలు పోయింది. ఇంటిల్లి పాదీ దుఃఖ సముద్రంలో

మునిగిపోయారు.

నేను మధుకర్‌ ఇంటికీ హమ్జా ఇంటికీ మధ్య తిరుగుతూనే ఉన్నా., ఆందోళనగా

బాధగా భయంగా!

ఎంత దుర్మార్గం... గోశాల నుంచి తప్పించుకొచ్చిన శబరి ఆవు ఏం చెప్పింది.

అక్కడంతా ఆవులను కబేళాకు తరలిస్తున్నారని మధుకర్‌ని చంపి, హమ్జా కాళ్ళిరగ్గొట్టిన

ముఠా నాయకుడే కబేళాకు తరిలిస్తున్నాడంట రాత్రి పూట మూసి ఉన్న లారీలలో.

అక్కడినుంచి వేరే దేశాలకు పంపిస్తారంట. చాలా పెద్ద వ్యాపారమంట వాళ్లది.

నాకు ఈ విషయం ఎప్పుడో తెలుసు అందుకే నేను..నా చెల్లెలు గీతావు వాళ్ళకి

చిక్కకుండా దేశమంతా తిరుగుతూ ఉన్నాము నడుస్తూ... పరిగెత్తూ... దుంకుతూ

పారిపోతూ ఉన్నాము. దేశమంతా ఇలానే ఉంది. మనుషులు, ఆవుల .,హత్యలతో. నేను అనేక తావులుమారుతూ ఉన్నా. చివరికి ఇదిగో ఈ మధుకర్ ఊర్లో తేలాను. కాషాయగుడ్డ కనిపిస్తే చాలు.

మా ఆవుల గుండెల్లో ముసల్మాన్లు... దళితుల గుండెల్లో రాళ్ళ పరిగెడతాయి.వలసలు..

దేశమంతా వలసలే., మనుషులు, ఆవుల వలసలు.

ఈ మధ్య తమ ఆవుల్ని చూసి కూడా ముసల్మాన్లు, దళితులు పులినో సింహాన్నో

విషనాగునో చూసినట్లు భయపడుతున్నారు. తమ ఆవులు కనపడగానే వాళ్ళ మొఖాల్లో

అంతు లేని భయం కనిపిస్తున్నది. వెంటనే పక్క పక్కకి తప్పుకుంటున్నారు. మా ఆవులు

వీధి దాటాకే మెల్లగా బయటకి వస్తున్నారు.

ఆ రాత్రి నేను, శబరి ఆవు చాలా మాట్లాడుకున్నాము. ‘‘నాకు మొన్న రామనవమి

రోజు రాముణ్ణి ఊరేగింపులో చూస్తే చాలా భయం వేసింది తెలుసా’’ అంది శబరి ఆవు. ‘‘ఏం

ఎందుకని?’’ అడిగాను .

‘‘ఏమో... మన అమ్మల తాతల కాలం నాటి రాముడిలా శాంతంగా, ప్రేమగా లేడు

రాముడు. అదేంటసలు ఆ సిక్స్‌ పాక్‌ ఛాతీ... చేతిలో త్రిశూలం, పెద్ద కత్తి ఎవరినో

నరికేయడానికి బయలుదేరుతున్నట్లే, యుద్దానికి సిద్దమైనట్లే ... రక్తంలా ఎర్రబడ్డ కళ్ళతోఉన్నాడు. చుట్టూ కేకలు అరుపులతో తాగేసి గెంతుతూ, ఊగిపోతూ త్రిశూలాలూ కత్తులు

పట్కొని గాల్లో ఆడిస్తూ ఉన్న మూకలు, అంత భయానకంగా చేసుకోవాలా పండగల్ని అదీ

వీధుల్లోపడి ? చుట్టు పక్కల ఉన్న ముస్లిమ్స్ బయటకు రాకుండా ఇళ్ళల్లోనే దాక్కునేట్లు...హిందువులు కూడా భయపడేట్లు?

ఆ పండగ భీభస్థాన్ని చూస్తుంటే నాకు నేనున్న కబేళా గుర్తొచ్చింది... చంపేస్తారేమోనని

భయం వేసింది’’ శబరి ఆవు భయంలో చెప్పింది.శబరి ఆవుకి రాముడు మీద ఇంకా ఏవో

భ్రమలు ఉన్నాయనిపించింది. ‘‘రాముడు ఇప్పుడు వీళ్ళు చూపిస్తున్నలాంటి వాడేను... రౌద్ర రాముడేను.

రాముడు కూడా రాజ్యం నిలబెట్టుకోవడం కోసం, సీత కోసం ఎంతో మందిని చంపాడు తెలుసా

ఆ హత్యలను కప్పిపుచ్చాడానికి దానికో ధర్మ రక్షణ అని పేరు అంతే శబరీ” అన్నా శబరితో.

అయినా ఈ నిజాలు., ఇదంతా ఎవరు చెబుతారు మందికి?’’ నిట్టూరుస్తూ అన్నాను. ఇంతలో

అక్కడికి కౌసల్యావు వచ్చింది. అది కూడా గోశాల నుంచి తప్పించుకొచ్చిన అనాథ ఆవే.

‘‘వందల సంవత్సరాలుగా ఈ కులవ్యవస్థ మన చచ్చిన పశువులను మాదిగ కులం

వాళ్ళు ఎత్తేయాలనే అంది కదా...వాళ్ళ కొట్టాలలో పశువుల్ని సాకేది పెంట తీసి శుభ్రం

చేసేది వాళ్లే.మన పాలు పిండుకుని తాగి, పెరుగు, వెన్న, నెయ్యి, జున్నూ ఆ పై కులపోళ్ళు

తింటూ పైకెళ్ళి వాళ్ళనే ఊరికి దూరంగా పెట్టింది. మరి మన తోలు వాళ్ళే తీస్తే తప్పు ఎలా

అయ్యింది నాటకాలు కాకపోతే.,భయపెట్టటం అంతే” అన్నాను నేను .

“అవునవును” అంది కౌసల్యావు. అది కూడా శబరావు వెనకే ఒక రోజు తర్వాతే వచ్చింది. శ బరావు నోరు విప్పిందీ సారి. ‘‘చచ్చిన మన చర్మం ఒలిచి దాన్ని మంచిగా నున్నగా చేసి

తోళ్ళ పరిశ్రమలకి బోలేడంత మంది మధుకర్‌ లాంటి వాళ్ళు అనాదిగా వేల కోట్లు

పరిశ్రమలకు ముడి సరుకుని అందిస్తున్నారు. పాపం వాళ్ళ బతుకేదో బతుకుతున్నారు. వీళ్ళ

మీద బతికేది వాళ్ళే మళ్ళా! అది ఒప్పుకోరు. మనల్ని చచ్చాకే తింటారు కదా... వాళ్ళ

ఆహార పద్ధతి అది అసలు వీళ్ళకెందుకుట వాళ్లకేం అధికారం ఉందసలు? మళ్లా మనం సస్తే

మన పీనుగులను ఎత్తేయమని ఈ గోరక్షకులు కూడా వీళ్లకే చెబుతారు” అంది శబరావు

కోపంగా.

‘‘అవును... అలాంటిది ఆవుతోలు వలుస్తున్నారని మాదిగ కులపోళ్ళను... అమ్మకానికి

పెట్టుకుంటున్నారని ముసల్మానులను చంపెయ్యడం ఎంత న్యాయం? అవును గానీ మరి

మన మల మూత్రాలతో మందుల వ్యాపారం వీళ్లు చేస్కోవచ్చా.. వాళ్ళకి అన్నీ నడుస్తాయి పై

కులపోళ్లు కదా మరి"? కౌసల్య ఆవు ఏదో లాజిక్కు తీసినట్లె అంది.

‘‘నిజానికి పాపం ముసల్మాన్ల ఉపాధి ఇది. ఆవు మాంసం అమ్ముకోవడం అట్లనే

మాదిగ వాళ్లు చర్మ వ్యాపారం చేస్తూ చెప్పుల పరిశ్రమకి సరఫరా చేయడం... ఉపాధే కదా...

మన ఆవుల్ని అడ్డం పెట్టుకొని వీళ్లు రాజకీయాలెందుకు చేస్తున్నట్లో’’ అన్నాను నేను.

“మీకో సంగతి తెలుసా నేను మొన్న దర్గాలో రొట్టెలు పంచుతుంటే పోయాను ఆకలికి

తట్టుకోలేక. పాపం ఒక ముసల్మాన్‌ స్త్రీ భురఖా వేస్కుంది. ఆమె దర్గాకి మొక్కుకి వచ్చింది.

అక్కడే ఉన్న “జై భజరంగ్‌ దళ్‌” అంటూ అరుస్తున్న వాళ్ళల్లో ఒకడు ఆమె దగ్గరకొచ్చి

బురఖా లాగి “నీ అందమైన మొఖం చూపించూ” అని వెకిలి చేష్టలతో వేధించాడు. ఆమె

భయపడి అరుచుకుంటూ పారిపోయింది. రొట్టెలు తీస్కొడానికి వచ్చిన మన ఆవుల్ని,

మనుషుల్ని అక్కడ వీరంగ సృష్టించి భయపెట్టి వెళ్ళగొట్టేసారు. మన ఆవులకి, బీదవాల్లకోసం ఆ ముసల్మాన్లు తెచ్చిన రొట్టెలు మట్టిలో చెల్లా చెదురు చేసి కాలితో నలిపేసారు.

వీళ్ళెందుకిలా చేస్తారు. మళ్లా గోరక్షుకులకు స్త్రీలంటే గౌరవం అంటారుగా”... కథ ముగించిన

కౌసల్యావు దిగులుగా అంది. “అంతేనా... గుళ్ళో ఎనిమిదేళ్ళ ఆసిఫా బేగమ్‌ని మత్తు

మందిచ్చి చచ్చేదాకా అత్యాచారం చేసారు” దిగులుగా అంటూ చీకట్లోకి కన్నీళ్ళతో దిగులుగా

చూస్తూ అన్నాను నేను. ఆసిఫా ఖానుమ్ గుర్తొచ్చి దుఖం వచ్చింది నాకు. ఆ అత్యాచారం

తరువాత అక్కడి వాళ్ళంతా భయంతో ఇల్లు వదిలి పారిపోయారు. అక్కడి తోటల్లో ఆ ఇళ్ళ

చుట్టూ పక్కల ఉన్న గడ్డి తినడానికి నేను, నా తోటి ఆవులు, గుర్రాలు వెళ్ళినా తరిమి కొట్టి

కంచె వేశారు. ఆ తరువాత .. ఆ చిన్నారి ఆసిఫా ఖానుమ్ సమాధి మీదే ఆ భూముల్లో

కొంపెనీలు వచ్చాయి. “ఇక్కడ ప్రమాదం అందరికీ కనిపిస్తున్నాము. వేరే ఎటైనా పోదాం

పదండి”అంటూ శబరి ఆవు నన్ను కుదిపితే ఉలిక్కి పడి ఆలోచనల్లోంచి తేరుకున్నా.

==========

ఆ రాత్రి నేను, కౌసల్యావు... శబరావు ముగ్గురం రసూల్‌ ఇంటి వాకిట్లో

కూర్చొన్నాము. చంద్రుడు చల్లగా వెన్నల పంఖా వేస్తున్నాడు.

రసూల్‌ వాళ్ళిల్లు హమ్జా వాళ్ళింటి పక్కనే. ముందు గదిలో టీవీలో వార్తలు

వస్తున్నాయి. టీవీ బయటి వాకిట్లో ఉన్న మా ముగ్గురికి టీవీ కనిపిస్తోంది.

‘‘బతికినంత కాలమూ ఆవు పాలు, గో మూత్రం, ఔషధం అంటూ తాగుతారు. ఆవు పేడ

వొంటికి రాసుకుంటారు. ఆవు మలమూత్రాలతో మందుల వ్యాపారమూ మీరే చేస్తుంటారు.

గోవు మీకు తల్లి కదా.. మరి గోమాతా కదా? మరి గోవు చస్తే., కొడుకులు కదా మీరు... మీరే

అంత్యక్రియలు జరుపుకోండి. ఇదిగో తీస్కోండి మీ గోమాతలకు పవిత్రంగా పూజలు హోమాలు

చేస్కుంటూ శాస్త్రోక్తంగా దహన సంస్కారాలు చేస్కోండి.’’

మాదిగ మహా యాత్రలో... ఆగ్రహంతో ఊగిపోతూ చచ్చిన ఆవుల్ని, కాషాయ జండా

ఎగురుతున్న గవర్నమెంటు ఆఫీసుల ముందు వేసేస్తున్నారు.

అదేంటి ..టీవీలో ధర్నాలో ఊర్మిళ ఆవు ఉన్దేంటి? అదెప్పుడు వెళ్లింది అక్కడికి...వాళ్ళతో పాటు నినాదాలు ఇస్తోంది.

ఓహ్ నిజంగా మనమూ అక్కడ ఉంటే ఎంత బాగుండేది? ఈ సారి మనం కూడా దర్నాలో పాల్గొందామ్ సరేనా ?

నేను ఆనంద పారవశ్యంతో అన్నాను."సరే సీతా తప్పకుండా వెళదాం అక్కడికి"అన్నాయి సంతోషంగా మెరుస్తున్న కళ్ళతో శబరి,కౌసల్య.

ఆహా ఎంత గొప్ప అద్భుతం? ఆవులు ధర్నాలో పాల్గొనడం.. జరగాల్సిందే ఇది. నేను సంబరంగా తన్మయంగా

అంటోంటే శబరి ఆవు, కౌసల్యావు కొమ్ములూపుతూ సంతోషంగా నవ్వాయి.

ఇక నుంచీ చచ్చిన గొడ్లను తియ్యం!

సఫాయి పనులు చెయ్యం!

మీ మురికి మీరే శుభ్రం చేస్కోండి !

మీ రాజ్యంలో బతకడం కంటే చావే నయం!

ఆజాదీ కావాలి. కుల పీడన, మత పీడన నుంచి శాశ్వతమైన ఆజాదీ కావాలి !

‘‘ఆవు తోక పట్టు కొని మీరే వెళ్ళండి... మాకు మా భూమి ఇవ్వండి’’ ముస్లిములు

కూడా తలల మీద టోపీలతో... వాళ్ళలో కలిసి నినాదాలు చేస్తుంటే...ఓహ్హో కన్నుల పండుగగా

ఉంది. జరగాల్సిందే... జరగాల్సిందే” అంటూ నేను లేచి ఆనందంగా నాట్యం చేయసాగాను.

మెరుస్తున్న కళ్ళతో సంతోషంగా శబరి, కౌసల్యా కూడా లేచి కొమ్ములూ పుతూ నాట్యం

చేశాయి. ... ఇంట్లో టీవీ చూస్తున్న రసూల్‌ పదేళ్ళ కొడుకు "ఆజాదీ... ఆజాదీ"

అని అరిచిన అరుపుకు ఆకాశం నుంచి రెండు చుక్కలు రాలి కింద పడి..మెరిసినట్లె అన్పించింది

నాకు.

===================

భోరున వర్షం కురుస్తోంది. రోడ్లు ఏర్లై పారుతున్నాయి. వెంట కౌసల్యా , శబరి ఇద్దరూ

లేరు. చెల్లి గీత చనిపోయాక వీళ్లిద్దరే తోడుగా ఉన్నారు. ఆ క్రితం రోజే వెంటాడి వేటాడి కర్రలతో

పొడుస్తూ కొడుతూ తీస్కెళ్ళిపోయారు గోరక్షకులు. నేను ఎట్టాగో తప్పించుకున్నా. కానీ ఒంటి

నిండా గాయాలు నొప్పి తాళలేక పోతున్నా.

రాత్రి నిద్రే లేదు.... పడుకునే తావే లేదు నాకు. నడుస్తున్నా తప్పించుకుంటూ

వగరుస్తూ.. హమ్మయ్య గుబురుగా ఉన్న చెట్టుకింద ఇంత చోటు దొరికింది. నేను వెళ్ళి

అక్కడే కూలబడ్డాను. ఆకలి... ఇంత గడ్డి పోనీ ఇన్ని రొట్టెలు దొరికితే బాగుండు... నీరసంగా

నేల మీద తల వాల్చాను. గోరక్షకుల నుంచి తప్పించుకోవడానికి పరిగెత్తానేమో

అలిసిపోయాను. వెంఠనే నిద్ర పట్టేసింది.

నేను.,శబరి ఆవు, కౌసల్యావూ పరిగెడ్తున్నాము. త్రిశూలాలు, కత్తులు పట్టుకొని

వెంటాడుతున్నారు. “రండి...మన సంస్కృతిని రక్షించుకుందాం. మిమ్మల్ని మేం కాపాడతాం

... తిండి పెడతాం... కబేళాలకేమీ తరిలించం. పారిపోకండి గో మాతల్లారా ఆగండి” అంటూ

అరుస్తున్నారు.

ప్రాణభయంతో వగరుస్తూ భయంతో పరిగెడ్తున్నాము. “వీళ్ళు మనల్ని మధుకర్లు...

వీరయ్యలు, హమ్జాలు, రసూల్‌, అజ్మీర్‌, యాకూబ్‌ల నించి రక్షిస్తున్నామంటారు కానీ...

అలా ఏముండదు గోశాల నుంచి నేరుగా రాత్రిళ్లు దొంగతనంగా కబెలాకే పంపేస్తారు. ఆకలితో

అలమతించిపోయినా కావాలని గడ్డి వెయ్యరు మాడుస్తారు. బక్కగా అయిపోతే కబేళాకి

పంపచ్చని కొడతారు కూడా. వద్దు వాళ్ళ మాట నమ్మద్దు నేను చూసాగా...ఆగకండి

పరిగెత్తండి “ అహల్య ఆవు ఎగరొప్పుతూ అంది. నేను చెమటలు కక్కుతూ చుట్టూ చూసాను.

తమలాగా అన్నీ ఆవులే ఏమీ లేవు. వందల మంది మధుకర్లున్నారు. వేల మంది హమ్జాలు,

రసూల్‌ ` యాఖూబ్‌, అద్నాన్ లు, అబ్బాస్‌లు, బిలాల్‌, మహమూద్‌ అబ్బుర్స్‌

రెహమాన్‌, ఆదిల్‌, ఆసిఫ్‌లు, బిల్కిస్‌ జహాన్‌, రాషిద్‌ జహాన్‌, అహ్మదీ బేగం, అప్సానా

బేగంలు ఉన్నారు... అందరూ ప్రాణభయంతో అరుస్తూ బచావో... నక్కో మారో... చంపకండి

రక్షించండి అని అరుస్తూ పరిగెడుతున్నారు. మెల్లగా వాళ్ల సంఖ్య ఇంకా పెరుగుతోంది.

తమలాంటి ఆవుల సంఖ్య కూడా వేలల్లో పెరిగిపోయింది. పరుగు.. ఆకలి నుంచి, దెబ్బల

నుంచి, మరణం నుంచి తప్పించుకుంటూ మనుషులు, ఆవులూ కలిసి పరిగెడ్తూ...

అరుస్తూ... ఏడుస్తూ... పడిపోతూ... లేస్తూ వాళ్లు విసిరిన కొన్ని త్రిశూలాలు, కత్తుల నుంచి తప్పించుకుంటూ.... పరిగెడ్తూ... ఇంతలో ఒక త్రిశూలం వచ్చి నా

వీపులో గుచ్చుకుంది. నేను భయం తో “అంబా... రక్షించండి”... అని అరుస్తూ

కుప్పకూలిపోయాను. నొప్పితో అరవలేక విలవిల్లాడుతూ రక్తశిక్తమైనాను.

‘చచ్చిందిరా... పిలవండిరా ఆ మధుకర్‌ వాళ్ల నాయనను తోలు వలవాలి”... అంటూ

కాషాయ మూక నాయకుడు. క్రూరమైన ఆనందంతో నవ్వాడు. మెడ పైకి లేపి అంత

బాధ,భయం లోనూ అతని మొఖాన్ని చూసాను. అతనో రాక్షసుడిలా కనపడ్డాడు...మొఖంలో పుట్టినప్పటి మనిషి రంగు లేదు “పూర్తిగా

చావలేదురా” అంటూ త్రిశూలాన్ని నా వీపు లోపలకి మరింత పొడిచాడు. “అంబా వద్దు

వదిలేయి నన్ను” నేను దీనంగా ప్రార్థించాను. వాడు వదల్లేదు ఇంకోసారి పొడిచాడు. నేను

కింద పడి గిల గిల లాడసాగాను.చుట్టూ అంతా., అందరూ, అన్నీ పారిపోతూనే ఉన్నాయి.

మనుషులు, గోవులు ! అదొక పరుగు పందెంలా ఉంది. మనిషి నుంచి మనిషి, మనిషి నుంచి

గోవులు పారిపోతున్నాయి. చుట్టూ గాల్లో మనుషుల, ఆవుల పరుగుకి చెల రేగిన దుమ్ము

నిండిపోయింది. నా తోటి ఆవులన్నీ పారిపోయాయి. నేనెలా చిక్కాను? వాళ్ళు నన్ను

ఈడ్చుకు పోతున్నారు. నేను నొప్పికి తాళ లేక అంబా అని దీనంగా ఏడుస్తూ అరుస్తూనే

ఉన్నాను వదలమని ప్రార్థిస్తూనే ఉన్నాను. .

నాకు ఒక్కసారిగా మెలకువ వచ్చింది. ఓహో... ఇది కలనా? ఒళ్లంతా చెమటలు పట్టి

నా గుండె చప్పుడు నాకే వినిపిస్తోంది. నేను నీరసంగా లేచాను. శబరి ఆవు, కౌసల్యావుల

తోడు ఇప్పుడు లేదు. వాళ్ళని గోరక్షకులు తీస్కెళ్ళి పోయారు. ఆకలేసేస్తోంది నాకు. వీళ్ళ

నుంచి తప్పించుకుంటూ పరిగెడుతుంటేనే.,నా చెల్లి గీతకి కరెంటు తీగ తగిలి చనిపోయింది.

వీళ్ళ దుంపతెగ. ఎట్లా వీళ్ళతో? ఎవరు వీళ్ళ నుంచి రక్షించేది. చీకటైంది... మళ్ళీ భోరుమని

వర్షం మొదలైంది. ముందైతే వర్షం నుంచి బయట పడాలి నీడ ఒకటి వెతుక్కోవాలి. చెట్టునీడ

సరిపోవడం లేదు. నేను అక్కడినుంచి లేచాను. ఆదరాబాదరా కొద్దిగా పరిగెత్తినట్లే నడుస్తూ

తావు వెతుకుతున్నా.. దగ్గర్లో బస్టాపు కూడా లేదు.

దూరంగా ఒక ఇంటి ముందు కాషాయ జెండా ఎగరేసిన ఇల్లొకటి కనిపించింది. జెండా

వర్షానికి ముద్దగా తడిసి వేలాడుతోంది. జెండా కూడా ఏడుస్తుందా నా యాతన చూసి?భయం వేసింది. అయినా తప్పదు వాళ్ళకెలా

తెలుస్తుందీ? బయటే కదా., నేను ఊరుకుల పరుగులతో వెళ్ళి ఆ ఇంటి ముందరి

కారుషెడ్డులో నిలబడ్డాను . యజమాని బయటకు వెళ్ళినట్లున్నాడు షెడ్డు ఖాళీగా ఉంది.

హమ్మయ్య వర్షం తగ్గేదాకా నిలబడొచ్చు అనుకుని నేను సంబర పడ్డాను. అప్పటి దాకా

వర్షంలో తడిసానేమో? చలి పెట్టింది. వణుకుతూ నిలబడ్డాను. ఎంటీ బాధ? తనలాంటి

పాలుడిగిన... వయసు మళ్ళిన ఆవులకి రక్షణే లేదు. చలికి వణుకుతున్ననాకు కళ్లల్లో నీళ్లు

తిరిగాయి. పాపం శబరి ఆవు, కౌసల్యావు... మొన్న కొత్తగా తప్పించుకున్న ఆహల్యావు ఏం

చేస్తున్నాయో... వాటికి అసలు తిండి పెడుతున్నారో లేదో?

13

ఇంతలో అక్కడికి కారొచ్చి ఆగింది. కారులో కూర్చున్న మనిషి నేరుగా కారు షెడ్డులోకి

దూసుకొచ్చాడు. కారులోంచే నన్ను హడీ... ఉష్‌ అంటూ తరిమాడు. ఒక్కసారి నా మీద

లైట్లు పడేసరికి నేను కలవరపడి ఎక్కడికి వెళ్ళాలో తెలియక షెడ్డు నుంచి బయటకు వెళ్ళే

తొందరలోనే నేల మీద కూలబడ్డాను. ఓహ్హ్ ... ఇతను గుడి పూజారి కదూ. గుళ్ళో హైందవ

ధర్మాన్ని బోధిస్తుంటాడు . రామాయణం చదివి వినిపిస్తూ ఉంటాడు. తనలాంటి గోవులకి భక్తితో

గుళ్ళో పూజలు చేస్తుంటాడు. చాలాసార్లు చూసానితన్ని. నుదుటి మీద పెద్ద కుంకుమ బొట్టు,

భుజం మీద కాషాయ కండువ, తెల్లని పంచెలో ఉన్నాడు. కారుకి అడ్డమొచ్చి... కారు గోడకు

గుద్దుకుని దెబ్బ తినేసరికి ఆయన పిచ్చి కోపం వచ్చేసింది. మీద కురుస్తున్న వర్షం మాట

మరిచిపోయి కారు దిగి నన్ను కాళ్లతో తంతూ... “ఫో ఇక్కడ్నించి” అంటూ పిచ్చెక్కినట్లే

అరుస్తూ.. ఇంకా ఇంకా కాళ్ళతో తంతున్నాడు షెడ్డు లో ఉన్న కర్రతో ఎలా అంటే అలా నన్ను

కొట్టటం మొదలు పెట్టాడు. గుడి పూజారేనా ఇతను.,అక్కడికెళితే భక్తిగా ఎన్నిసార్లు తనకి

మొక్కలేదు., పండ్లు పెట్టలేదు? ‘‘ఉండనియ్యు పంతులు... ఈ భోరుమని పడే వర్షంలో

తలుదాచుకోడానికి కాస్త జాగా దొరకట్లేదు వర్షం తగ్గగానే వెళ్ళిపోతానుగా గుడి ముందుకొస్తే

దండం పెట్టి అరటి పళ్ళు పెడతావు... కదా. ఇప్పుడిలా కాళ్ళతో తన్నడం ఏ నీతి పంతులూ... వర్షం తగ్గేదాక ఇక్కడే

ఉండనియ్యూ” అంటూ నేను దీనంగా చేతులు జోడిస్తూ, కొమ్ములతో చిన్నగా తల వూపుతూ

అడిగాను. దెబ్బలు తప్పించుకుని మెల్లిగా లేస్తూ. "ముందు ‘ఫో ఇక్కడ్నించి లేకపోతే కట్టేసి

నిన్నెక్కడికే పంపాలో అక్కడికే పంపుతాను’’ అంటూ మళ్ళీ తన్నడానికి చేయెత్తాడు. నాకు

అతని బెదిరింపులో శ్లేష అర్థం అయింది. నేను ఆ దెబ్బలను తప్పించుకుని భయంతో పరుగు

తీసాను. గోశాలకీ... కబేళాకేగా వీడు పంపేది?వెంటనే అక్కడినుంచి పరుగు మొదలెట్టాను. పది నిముషాల పాటు

అదే పరుగు... పరుగు... ఆయాసంతో పరుగెడుతూనే ఉన్నాను. ఆకలి...

దాహం...వొంటరితనం, దెబ్బల నొప్పికి తోడు ఆయాసంతో నాకు దుఃఖం వచ్చింది. అక్కడే

కూలబడి పోయి వర్షంలో భోరుమని ఏడిచేశాను. నాతో పాటు వర్షం కూడా ఏడుస్తుంది

అనిపించింది. మెల్లిగా తేరుకుని లేచాను.

14

అలా నడిచి..నడిచి..నేను ఒక ఇంటి ముందు ఆగాను... ఓహ్హ్.. ఇది ఆ హమ్జా ఇల్లు... వీళ్ళ నాన్ననే మేక

మాంసం తీసుకెళుతుంటే గొడ్డు మాంసం తీస్కెళుతున్నాడు అని కొట్టి కొట్టి చంపేసారు. పాపం

అప్పట్నించీ హమ్జానే కుటుంబాన్ని పోషిస్తూన్నాడు. కానీ మధుకర్‌ను రక్షించబోయిన హమ్జా

కాళ్ళు విరగ్గొట్టారు. పాపం హమ్జా ఇప్పుడు కుటుంబాన్ని ఎలా పోషిస్తాడు? భర్త హత్యని

తట్టుకోలేని హమ్జా తల్లి పిచ్చిదై పోయింది. హమ్జా భార్య పైనే ఇప్పుడు ఆ కుటుంబం

ఆధారపడింది. ఈ భోరుమని పడే తుఫానులో హమ్జా భార్య తలుపు తీస్తుందా., ఏమో? కొంత

కాలంగా ఆవులను కళ్ళెత్తి చూడాలన్నా వాళ్ళు భయపడ్తున్నారు.మేము సాధు జంతువులమే మమ్మల్ని చూసి భయపడద్దు అని గొంతెత్తి చెప్పాలి అనిపించింది చాలా సార్లు..మాకు ఈ గోమాత,దేవత కిరీటాలు కాదు,ఆకలి తీరడం కావాలి,రక్షణ కావాలి ఎలా చెప్పాలి ఈ దునియాకి?

నేను ధైర్యం చేసి గేటు ముందుకు వెళ్ళి అంబా అని అరిచాను. అరుస్తూనే ఉన్నాను..

తుఫాను... వర్షం... మేఘ ఘర్జనలు... అంధకారం... గాలి... చలి మధ్య వణుకుతూ

అరుస్తూ... ఏడుస్తూ... నేను..అంధకారంలో నేను ... గాలి తుఫానులో నేను ... వర్షంలో నేను

... ఏడుస్తూ నేను ... ఆకలితో నేను ... దెబ్బల నొప్పితో నేను ... వణుకుతూ చీకట్లో...

తుఫానులో... వర్షంలో... చలిలో... గాలిలో... నేనే సీతావుని ... ఏడుస్తూన్న సీతావుని ...

అంబా తలుపు తీయండి అంటూ సీతావుని ... హమ్జా.... అంటూన్న సీతావుని .

ఒక్కసారిగా తలుపు తెరుచుకుంది . లోపల్నించి భళ్ళుమని బయటకి దుంకిన

వెలుగు. ఎక్కడి నుంచో రాతిరి చేసే తహజూద్ నమాజ్‌ వినిపిస్తూంది అల్లాహ్ అంటూ

గాలిలో తేలి వస్తుంది. నేను కన్నీళ్లతో తన్మయమైన నొప్పితో కళ్ళు మూసుకున్నాను. ఇంట్లోంచి నా వైపు వైపు ఏదో

వెలుగు వస్తోంది. చీకట్లో హమ్జా భార్య గొడుగేస్కుని పరిగెత్తుకుంటూ టార్చి వెలుతురులో

నన్ను పరికించి చూసింది. నేను కన్నీళ్లతో చేతులు జోడిస్తూ., కొమ్ములు ఊపుతూ “అమ్మా

నా పేరు సీత దిక్కు మొక్కూలేని అనాథని. తలుపు తెరువు చలికి చచ్చిపోతున్నా” అంటూ

ప్రార్థించాను. దుఖంతో., చలితో నిలువెల్లా వొణికిపోతున్నాను.రజియా కళ్ళల్లో నీళ్ళు “నువ్వు భయపడకు సీతా

తాళం తీస్తానుండు” అంటూ ఇంట్లోంచి అత్త వేసిన కేకకి బదులిస్తూ “ఆరీ సాంసూ మా

హాయ్‌ అల్లా... గావ్‌ హై... బారిస్‌ మే బీగ్‌ జారీ బిచారీ’’ {హాయ్ అల్లా ఇది ఆవు. వర్షంలో

తడిసిపోతున్నది పాపం”}అంటూ “సీతా ఇప్పుడే వస్థా ఉండు తాళం చెవి లోపల ఉంది” అంటూ లోపలికి పరిగెత్తుకెళ్ళి

అత్తమ్మను వెంటేసుకు వచ్చింది. ఏమైందని అడుగుతున్న భర్త హమ్జాకీ ‘‘గావ్‌ హై... పానీ

మేఁ భీగ్‌ జారీ...’’ (ఆవు..వర్షం లో తడిసి పోయింది)అని చెప్తూ బయటకు వచ్చింది.

‘‘వాళ్ళు మన మీద దొంగతనం కేసు పెడతారేమో... పోలీసులకు అప్ప చెప్తారేమో’’

హమ్జా తల్లి భయంగా అంటుంటే ‘‘కుచ్‌ నై హోతా అమ్మీ... బిచారీ... బీగ్‌ జారీ... తడప్‌రీ

శుభాయీభ్‌ భేజ్‌దేంగే దేఖో ఆప్ జాదా నక్కో సోచో ’’ అంది. (ఏమీ కాదు అమ్మీ పాపం

తడిసిపోయి వణికిపోతున్నది పొద్దున్నే వదిలేద్దాం, నువ్వెక్కువ ఆలోచించకు)

ఇద్దరూ కలిసి గేట్‌ తెరిచారు. ‘‘ఆజా... ఆజా.. అందర్ ఆజా సీతా” అని హమజా భార్య

నుస్రత్ బేగం లోపలికి పిలుస్తుంటే నేను తేరుకుని మెల్లగా లోపలికి నడిచాను. వాళ్లసలు

నన్ను లోపలికి రానిస్తారనుకోలేదు. వాకిట్లోని చావిడీలోకి నన్ను తీస్కేళ్లారు అత్తా కోడళ్లు.

పిల్లలు గోలగోలగా అరుస్తున్నారు. చావిడిలోకి వచ్చిన నాకు వెచ్చని గొంగళీ ఒకటి కప్పారు.

వర్షం అని చూడకుండా అక్కడ వాకిట్లో ఉన్న మొక్కల ఆకులు తెంపి వేసారు. ‘‘థోడా ఆట్టా

(పిండి) దాలో భూఖీ హూంగీ’’ అని హమ్జా లోపల్నించి అరిచాడు.{కొంచెం గోధుమ పిండి

వేయండి పాపం ఆకలితో ఉన్నట్లుంది”}

భయంకరమైన ఆకలి మీద ఉన్నానేమో ఆత్రంగా వాళ్ళు పెట్టినవన్నీ తినేశాను. వాళ్ళ

ప్రేమకు గుండె గొంతులో కొట్టుకుంది. నా కళ్ళు రెండూ నదులై పారాయి. “ఏ డవకు సీతా

ఇక్కడే ఉండు ఏమీ కాదు” అంటూ నుస్రత్ బేగం నా కన్నీళ్ళు తుడిచింది. లోపల్నించి

హమ్జా గొంతు, పిల్లల కేరింతలు టీవీలో వార్తలు... “ఖావో సీతా.. ఖావో...మత్ రో ఉచ్‌...

బిచారీ” {తిను సీతా తిను..ఏడవకు అయ్యో పాపం”}అంటూ బుజ్జగిస్తూ ప్రేమతో తినిపిస్తున్న

అత్తా కోడళ్ళు దయకల మొఖాలతో వాత్సల్యపు చూపులతో., వాళ్ళ ప్రేమలో తడిసిపోతూ...

నేను ఏడిచేశాను. ‘‘రో మత్.,దేఖో శుభా హోతేయీజ్‌ చలే జానా నైతో హమ్‌కో... తుమ్‌కో...

సబ్‌కో పరేషానీ ఠీఖ్‌ హైనా? (ఏడవకు.. చూడు పొద్దున్నే వెళ్ళిపోవాలి సరేనా? లేకపోతే

మాకూ... నీకూ ఇద్దరికీ ప్రమాదమే!) అంటూ హమ్జా వాళ్ళమ్మ నాకు బుజ్జగిస్తున్నట్లే

చెప్పింది.

16

‘‘సరే... నేను పొద్దున్నే వెళ్ళిపోతాను మీరు నిమ్మళంగా ఉండండి లోనకెళ్ళి పడుకోండి’’

అన్నాను కళ్ళు చెమరుస్తూంటే. “అమ్మీ కల్ కా బాత్ కల్ దేఖ్లెంగే . బిచారీ సీత కల్ భీ కహా

జాయేగీ? రహనే కే లియే ఖుద్ కా జాగా హై తో యహా క్యో ఆయేగీ? చలియే అందర్ జాయేంగే

., సీతా నువ్వు పడుకో రేపటి సంగతి రేపు చూద్దాం” అంది నుస్రత్ బేగం. {అమ్మీ రేపటి

సంగతి రేపు చూసుకుందాం . పాపం సీత రేపైనా ఎక్కడికి వెళుతుంది చెప్పు. తనకి

ఉండడానికి తన స్వంత జాగా ఉంటే మన దగ్గరికి ఎందుకు వస్తుంది చెప్పు?} వాళ్ళు

లోపలికి వెళ్ళిపోయారు. తలుపులు మూసుకున్నా లోపల వెలుతురేదో సందుల్లోంచి

కిటికీల్లోంచి బయటకు వచ్చి... నా మొఖంపై పడుతోంది. ఆ వెలుతురులో నేను., నేనే

అవును నేనే !

నేను ఆ వెలుతురులో! ఎందుకో లోపలికి వెళ్ళి హామ్జాని చూడాలనిపించింది.నా దాకా రాగలడో లేదో కాళ్ళు విరగ్గొట్టా రు కదా..సరే రేపుదయం చూస్తా.

నేను నిమ్మళంగా నిద్రకి ఒరిగాను.


- గీతాంజలి 



Similar News