తెనాలి మిత్రుడు రావూరి శివకృష్ణ తండ్రి కీ. శే. రావూరి శివయ్య (సాంబశివరావు) గారి రెండో వర్ధంతిని పురస్కరించుకుని, ప్రజాతంత్ర ఉద్యమాల కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ప్రజా విజ్ఞాన చైతన్య వేదిక స్వచ్ఛందంగా ప్రచురించి పంపిణీ చేసిన పుస్తకం, 'భావజాల సౌధాలు'/ కొన్ని మానవీయ సంస్థల సంక్షిప్త పరిచయాలు !
చార్వాకాశ్రమం, సత్యాన్వేషణ మండలి, ఖదిజ్ఞాసి ఆశ్రమం, శాంతి ఆశ్రమం వంటి తెలుగు రాష్ట్రాలలోని సంస్థలతో పాటు చత్తీస్‌గఢ్‌లోని కబీర్ ఆశ్రమం, మహరాష్ట్రలోని యూసఫ్ మెహరాలీ సెంటర్, కేరళలోని మజువంచరీ ఆలయం, ఉత్తరాఖండ్‌లోని మాతృసదన్, బీటిల్స్ ఆశ్రమం, హిమాచల్ లోని సంభావన వంటి 15 సంస్థల గురించినదీ చిరు పొత్తం !
భావవాద, భౌతికవాద స్రవంతులకి అతీతంగా మానవతావాద మార్గాన్ని అనుసరిస్తున్న కొన్నిసంస్థల్ని గూర్చి కూర్చిన ఈ వర్క్ జపనీస్ అరాజక వాది, జెన్ బౌద్ధ తత్వవేత్త, కమ్యూనిస్టు యోధుడు, అతిచిన్న వయసులో ఆధిపత్యానికి నిరసనగా గళమెత్తి గర్జించి ఉరికంబం ఎక్కి మృత్యువును ధైర్యంగా ముద్దాడిన 'వుచియామా గూడో' త్యాగానికి ఈ కృతి అంకితం !
ఇంకా ఇలాంటి సంస్థలు, సంఘాలు పదుల సంఖ్యలో ఉన్నాయి. త్వరలో మరిన్నింటిని ఈ విధంగా పరిచయం చేయాల్సి ఉంది. ఎంతవరకు అవుతుందో చూడాలి. కాలక్షేపం కోసం కాకుండా సామాజిక కార్యక్షేత్రంలో ఏదో మేరకు పని చేస్తున్న సంస్థల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న సీరియస్ ఆలోచనాపరులకి సాఫ్ట్ కాపీ పంపుతున్నాను. విమర్శలకు ఆహ్వానం!
- గౌరవ్
సామాజిక, సాంస్కృతిక కార్యకర్త
90320 94492