ప్రేమకు సందేశం

Update: 2022-05-15 21:11 GMT

ప్రేమకు సందేశం

శతాబ్దాలు గడుస్తున్న శత్రుత్వం పోలేదు

తరాలు మారుతున్న తలరాతలైతె మారలేదు

కాలాలే మారుతున్న కట్టుబాట్లు కాలలేదు

ఎందుకీ సదువులు మెదళ్లను కడగనప్పుడు?

ఆధిపత్య కులాలేమో అణగారినవర్గాలనీ

అణగారిణవర్గాలేమో పరువూ ప్రతిష్టల కోసమనీ

గీసుకున్న చెరసాలలో జీవిత ఖైదీ అవుతుండ్రు

మతోన్మాద వ్యూహాల్లో కొందరు కొట్టుకు సస్తుంటే,

మానవత్వాలే మరిసి మనుసులు మృగాలై తిరుగుతుండ్రు,

మననుషులంత ఒకటని మత గ్రంథాలు బోధిస్తుంటే

కుల,మతాలను కలపబోమని మనిషి శశనం రాస్తుండు.

ప్రేమిస్తే పాపమనీ, పెళ్లంటే నేరమనీ..

ప్రాణాలైనా పోనీ, పాపమైన అంటనీ, వెంటాడైనా, వేటాడైనా

ఆ జంటను విడదీయాలే, కర్కశంగ కడతేర్చి,

సజీవంగ తగలెట్టి నిర్జీవమైన ఈ సమాజానికి సందేశమిస్తున్నరు

కాలాలు మారినా మేమైతే మారమని


వెంకటేశ్ విశ్వ

జక్లేరు, మక్తల్, నారాయణపేట

95537 62108

Tags:    

Similar News