చర్మ చక్షువు చూడలేని అమ్మ

Update: 2022-05-08 19:58 GMT

ఏమిటా సాహసం

ఏమిటా ధైర్యం

దేనినైనా ఓడించగల తెగువా

నీకు మాత్రమే‌ తెలిసిన విద్యా

కాల వేగం కన్నా నీ మనో బలం మిన్న

కాలగతులను మార్చగల శక్తి స్వరూపిణి

బిడ్డ మేలు కన్నా ఏదీ ఎక్కువ కాదనే ధీమా

త్రిజ్జగాలను త్రిప్పగల పరమాత్మవా

అమ్మా... మమ్మల్ని క్షమించు

నీ పై జరుగుతున్న దాడుల నుండి

నిన్ను రక్షించుకోలేని నిస్సహాయ స్థితికి,

నీ జౌన్నత్యాన్ని అందుకోలేని మా మూఢతకు

బిడ్డ పట్ల నీకున్న 

అసాధారణ ప్రేమని గుర్తించలేని 

మా అంధత్వానికి....

చరిత్రలో నీ త్యాగం మాకు మార్గదర్శకం

ఎవరూ ఎప్పటికీ అందుకోలేని

శిఖర సమాన సహన శీలతకు

విశ్వం తరుఫున నమస్సులు

పాదాభివందనాలతో


అట్లూరి వెంకటరమణ

95507 76152

Tags:    

Similar News