నేస్తం..
తొలకరి జల్లులా చేరువై
ఏకాంతంలో తోడువై
ఆవేదనలో ఓదార్పువై
ఆనందంలో
ఆత్మీయతవయ్యావు
అమాయకత్వంతో
ఆకట్టుకుంటూ
వాలుచూపులతో
ఏవేవో రాగాలు పలికించి
చిరునవ్వుతో అగ్గి రాజేసి
పలుకుల మధురిమలతో
వలపు సంతకం చేసి
నా మది దోచేశావు
నీతో చెలిమి చేసాక
నా ఎదగూటిలో
ఎన్నెన్ని హృదయ సవ్వడులో!
నీవు పక్కనుంటే
సంతోషాలకు
నింగీ నేలా సరిహద్దులు లేవు
ప్రేమంటే ఇలాగే ఉంటుందేమో?
ఏదేమైనా చెలీ
ఒక్క మాట
మన కలయిక అద్భుతం
అందుకే
నీవూ నేనూ ఒక్కటై
కలకాలం
ఇలాగే ఉండిపోదామా!
వేమూరి శ్రీనివాస్
తాడేపల్లిగూడెం
99121 28967